Background
-
కేజ్రీవాల్ మరో జైలు సందేశం.. ఈసారి ‘ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్’
ఢిల్లీ, సాక్షి: జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి మరో సందేశం వచ్చింది. ఎప్పటిలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ఆ సందేశాన్ని వినిపించారు. అయితే ఈ సారి ఓ ఆసక్తికర అంశం ఉంది. అదేంటంటే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వెనుక గోడకు అంబేడ్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో పాటు సీఎం కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. అయితే కటకటాల వెనుక సీఎం ఉన్నట్లు ఆ ఫొటోను ఏర్పాటు చేశారు. "నేను జైలులో ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగానూ బాధపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజు వారి ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించాలి" అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నట్లు సునీత కేజ్రీవాల్ వీడియోలో చదివి వినిపించారు. "ప్రజల ప్రభుత్వపరమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జై హింద్" అని కేజ్రీవాల్ అన్నట్లుగా సునీత పేర్కొన్నారు. -
ఊహా ప్రపంచాలు.. కొత్త కథలతో స్టార్ హీరోల ప్రయోగాలు
మంచి ఊహలు ఎప్పుడూ బాగుంటాయి. నేరుగా చూడలేని ప్రపంచాలను ఊహించుకున్నప్పుడు ఓ ఆనందం దక్కుతుంది. ఇక కొత్త ప్రపంచాలను సిల్వర్ స్క్రీన్‌పై చూసినప్పుడు కనువిందుగా ఉంటుంది. అలా ఊహా ప్రపంచం నేపథ్యంలోని కథలకు కొందరు స్టార్స్ ఊ అన్నారు. కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను రా రమ్మంటున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం... పది సెట్స్‌లో విశ్వంభర ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (1990), ‘అంజి’ (2004) వంటివి చిరంజీవి కెరీర్‌లోని సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ జానర్‌ను టచ్ చేశారు చిరంజీవి. ఈ కోవలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా తొలి సినిమా ‘బింబిసార’ను సోషియో ఫ్యాంటసీ జానర్లో తీసిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ అంతా ఓ కల్పిత ప్రాంతంలో జరుగుతుందట. చిత్రీకరణకు తగ్గట్లుగా పదికి పైగా సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారట చిరంజీవి. ఈ చిత్రంలో హనుమంతుని భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, త్రిష హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ చైల్డ్ ఎపిసోడ్ కూడా ఉంటుందట. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ డేట్ అనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. కల్కి లోకం భారతీయ ఇతిహాసాల ఆధారంగా సైంటిఫిక్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా కథలో ఇతిహాసాల ప్రస్తావన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇండియా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాం అన్నట్లుగా ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల సందర్భంలో పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీ రోల్స్‌లో కనిపిస్తారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్’ తర్వాత హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘రావణం’ అనే మైథలాజికల్ ఫిల్మ్ రానుందని, ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఊహాజనిత ప్రపంచంలో జరిగే చిత్రం అని టాక్. ట్రాక్ మారింది ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’... హీరో అల్లు అర్జున్– దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవి. కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ మూడు సినిమాల తర్వాత అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్లో నాలుగో సినిమా గురించిన ప్రకటన వెల్లడైంది. కానీ ట్రాక్ మారింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రం ఉండదట. ఇది పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అని, మహాభారతం రిఫరెన్స్ ఈ సినిమాలో ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది. అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ్రపారంభం కావడానికి కాస్త సమయం పట్టేలా ఉందని తెలిసింది. కంగువ ప్రపంచం ‘కంగువ’ టీజర్ చూస్తున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా ప్రేక్షకులకు అనిపిస్తుంటుంది. సూర్య హీరోగా నటించిన చిత్రం ఇది. పూర్తి స్థాయి ఫ్యాంటసీ ఫిల్మ్ కాకపోయినప్పటికీ ‘కంగువ’లో ఆడియన్స్ ఆశ్చర్యపోయే, అబ్బురపరచే విజువల్స్ చాలానే ఉన్నాయన్నది కోలీవుడ్ టాక్. కథ రీత్యా కాస్త సైంటిఫిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో సూర్య పదికి పైగా గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందట. తొలి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. కేరాఫ్ భైరవకోన గరుడ పురాణంలో మిస్ అయిన ఓ నాలుగు పేజీల కథే ‘భైరవకోన’ అట. మరి.. ఈ గరుడ పురాణం పూర్తి వివరాలు, ఈ నాలుగు పేజీల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న థియేటర్స్‌లో విడుదలయ్యే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటించారు. అఘోరా శంకర్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ఇందులో శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్ కనిపిస్తారు. కథ రీత్యా శంకర్‌కు మానవ స్పర్శ తెలియదు. కానీ ఆ స్పర్శను అనుభూతి చెందాలన్నది అతని ఆకాంక్ష. ఈ క్రమంలో ఏం జరగుతుంది? అనేదే ‘గామి’ కథ అట. ఈ సినిమాలో అఘోరా ట్రాక్ మాత్రమే కాకుండా మరో స్టోరీ ట్రాక్ కూడా ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు సంవత్సరాలుగా తీస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. విద్యాధర కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జై హనుమాన్ ఈ సంక్రాంతికి ‘హను–మాన్’ సూపర్‌హిట్. అంజనాద్రి అనే ఊహాజనితప్రాంతం నేపథ్యంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. కాగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తీస్తున్నారు ప్రశాంత్ వర్మ. స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ‘జై హను–మాన్’ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండేట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అఖిల్ నెక్ట్స్ సినిమా గురించిన ఓ వార్త అక్కినేని ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ కలిసి ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాను నిర్మించనున్నాయట. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతారని భోగట్టా. ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇలా ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో మరికొన్ని సినిమాలు రానున్నాయి. -
పథకాల అమలుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు పథకాల పంపిణీ ఎలా ఉండాలి? నిబంధనల అమలు ఎలా ఉంది? అనే కోణంలో పరిశీలన మొదలుపెట్టింది. దళితబంధు, రైతుబంధు, బీసీ బంధులాంటి పథకాలకు సంబంధించి ప్రస్తుత సమయంలో లబ్ధిదారులకు సాయం అందించే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాల కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నోటిఫికేషన్ వచ్చే నాటికి లబ్ధి చేకూర్చాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నికల సంఘానికి వివరించింది. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం.. సంబంధిత శాఖలను వివరణ కోరింది. తక్షణమే స్పందించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. నివేదికలు సిద్ధం సంక్షేమ పథకాల అమలుపై ఎన్నికల సంఘం నివేదిక కోరడంతో సంబంధిత శాఖలు వివరణ ఇచ్చేందుకు ఉపక్రమించాయి. పథకాల వారీగా శాఖలు ఇప్పటికే సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాయి. దళితబంధు పథకం నియోజకవర్గం యూనిట్‌గా అమలు చేస్తున్న క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగతా 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమాచారంతో ఎస్సీ కార్పొరేషన్ సిద్ధమైంది. కాగా, రెండోవిడత దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి ఐదు వందల మంది లబ్ధిదారులకు సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ద్వారా పలు సిఫార్సులు రావడంతో వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటి విడతలో కూడా ఎంతమందికి లబ్ధి చేకూర్చారన్నది కూడా ఎన్నికల సంఘానికి వివరించనుంది. అదేవిధంగా రైతుబంధు పథకం కింద గత ఐదేళ్లుగా పంపిణీ చేసిన మొత్తంతో పాటు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు, వారికి ఇవ్వాల్సిన నిధులు తదితర సమాచారాన్ని సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీంతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న బీసీబంధు పథకం కింద అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ఎంతమందికి ఆర్థిక సాయం అందించారనే అంశాలను కూడా నివేదిక రూపంలో తయారుచేసి పెట్టుకుంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ వివరాలను ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం. -
రీజెన్సీ సిరామిక్స్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్ తొలిసారి రీజెన్సీ నేచురల్ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది. రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకాలు, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ టైల్స్, వాల్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, స్టెప్స్, రైజర్లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు. రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్ నరాల సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. రాజధాని నగరాలతోపాటు మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. -
మదర్ సెంటిమెంట్‌తో సదా `నంద`
సదా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నంద’. గోణుగుంట్ల విజయ్ కుమార్ సమర్పణలో కళ్యాణ్ ఎర్రగుంట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, దర్శకుడు మాట్లాడుతూ..‘నేను హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో `నంద` చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నా. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం మా చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటలు సమకూర్చారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం ` అన్నారు. ఈ చిత్రానికి డిఓపీః జైపాల్ రెడ్డి నిమ్మల; సంగీతంః చరణ్ అర్జున్. -
కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్తో టాలీవుడ్లో సందడి నెలకొంది. మెగా ఇంట్లో ఈ ఏడాది చివర్లో పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ఈ జంట సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. మిస్టర్ చిత్రంలో తొలిసారి జంటగా కలిసి నటించిన వీరిద్దరు తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారు. గతంలో చాలాసార్లు ఈ జంట గురించి డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: వరుణ్, లావణ్య పెళ్లి జరిగేది అక్కడేనా? ఆ సెంటిమెంట్) అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అడుగు పెట్టనుండటంతో అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కుటుంబ నేపథ్యం గురించి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 15న 1990లో యూపీలోని ఫైజాబాద్‌లో లావణ్య త్రిపాఠి జన్మించింది. ఆ తర్వాత లావణ్య ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పెరిగింది. ఆమె తండ్రి లాయర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమె తల్లి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కాగా.. ఆమె అక్క కమిషనర్‌గా పనిచేస్తున్నారు. లావణ్యకు ఓ సోదరుడు కూడా ఉన్నారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన లావణ్య ఆ తర్వాత ముంబయికి షిఫ్ట్ అయింది. ముంబయిలోని రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. (ఇది చదవండి: నేను నా బరువు కోసం కాదు, ఆరోగ్యం కోసం ఆలోచిస్తా: నిర్మాత) ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో టీవీ షోల్లో కనిపించింది. ఆమె పాఠశాలలో చదివే రోజుల్లోనే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతే కాకుండా శాస్త్రీయ నృత్యంలో కూడా నైపుణ్యం సాధించింది. నానితో నటించిన భలే భలే మగాడివోయ్ భరతనాట్యంతో మెప్పించిన సంగతి తెలిసిందే. హిందీలో ప్యార్ కా బంధన్ అనే టీవీ షో ద్వారా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి.. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. -
తెలంగాణ నేపథ్యంలో సినిమా తీస్తున్న మజ్ను డైరెక్టర్
‘ఉయ్యాల జంపాల, మజ్ను’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విరించి వర్మ. తన మూడో చిత్రాన్ని నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్నారాయన. ముదుగంటి క్రియేషన్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సందర్భంగా విరించి వర్మ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా నడిచే పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ఇది. 1980లో జరిగే ఒక పీరియాడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నటీనటుల వివరాలు, టైటిల్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్. -
'బింబిసార'లో అమాయకత్వంతో ఆకట్టుకున్న ఈ పాప ఎవరంటే?
త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా కల్యాణ్ రామ్ అదరగొడుతున్న చిత్రం 'బింబిసార'. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. టైమ్ ట్రావేల్ అనే సరికొత్తగా ప్రయోగం చేసిన కల్యాణ్ రామ్‌కు చాలా గ్యాప్ తర్వాత మంచి విజయం లభించింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటనకు, విజువల్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'బింబిసార'లో చిన్నారి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది బేబి శ్రీదేవి. త్రిగర్తల సామ్రాజ్యంలో ఆయుర్వేద పండితుడి (తనికెళ్ల భరణి) మనవరాలు శాంభవిగా, భూలోకంలో బింబిసారుడి వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బేబి శ్రీదేవి అమాయకత్వం, కల్యాణ్ రామ్‌తో వచ్చే సీన్లు మనసుకు హత్తుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ పాప ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బేబి శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్‌లో నివాసముండగా, శ్రీహరి గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బేబి శ్రీదేవి పున్నాగ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, కల్యాణ వైభోగం వంటి 15 సీరియల్లలో నటించి ఆకట్టుకుంది. అలాగే మేజర్, రామా రావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో సైతం నటించింది. View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) -
ఇండస్ట్రీ.. ప్లాన్ బి!
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయం, లక్ ఉండాలి. కానీ వీటన్నిటి కంటే ముఖ్యంగా కావాల్సింది పట్టుదల అంటున్నారు శ్రద్ధాదాస్. హీరోయిన్గా రాణించాలనుకుంటున్న వారికి ‘ప్లాన్ బి’ కూడా ఉండాలంటున్నారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్ట్‌గా పైకి రావాలంటే ముఖ్యంగా కావాల్సింది పట్టుదల. ఇక్కడ నిలబడాలంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ప్రయత్నించగలగాలి. యాక్చువల్లీ యాక్టర్స్ కావాలనుకునేవారిని ‘ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా టఫ్‌గా నిలబడగలగాలి. అలా స్ట్రాంగ్‌గా లేకపోతే వెనక్కి వెళ్లిపోండి’ అని నేనే చాలాసార్లు డిస్కరేజ్ చేశాను. అప్పటికీ రావాలనుకునేవాళ్లకు... ‘‘ఇది ‘ప్లాన్ బి’గా మాత్రమే పెట్టుకొని రండి. మీరు చేస్తున్న కార్పొరేట్ జాబ్, ఇంకేదైనా కూడా ప్లాన్ ‘ఏ’గానే ఉండాలి. అంటే.. ఇండస్ట్రీ అనేది సెకండరీ అనుకోవాలి’ అని చెబుతుంటాను. కొన్నిసార్లు మనం బాగా సూట్ అవుతాం అనుకున్న పాత్ర ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లకు వెళ్లిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో జనరల్‌గా జరిగే విషయాల్లో ఇదొకటి. అలాంటి సందర్భాల్లో చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుంది. కానీ ఆ తర్వాత అనిపిస్తుంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఫస్ట్ కొన్ని చాన్స్‌లు రావడం వరకే. ఆ తర్వాత ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్లకి చాన్సులు లభిస్తాయని. ఎప్పటికైనా ‘స్క్రీన్ మీద ఎలా ఉన్నాం’ అన్నదే మ్యాటర్. బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేదా? అన్నది ఆడియన్స్‌కు అనవసరం’’ అని పేర్కొన్నారు. -
అమ్మ వాళ్ల ఊరేదంటే..!
వీళ్లందరూ మనకు బాగా తెలిసిన వాళ్లు, మనోళ్లు. అయితే వీళ్ల నేపథ్యం మాత్రం ఆసక్తికరమైనది. ఎల్లలు లేని, మతాలు, జాతుల అంతరాలు లేని వివాహబంధాలకు ప్రతిరూపాలు వీళ్లంతా. భారతీయతతో పాటు మరో దేశం మూలాలను కూడా కలిగిన వారు వీళ్లు... వైవిధ్యమైన నేపథ్యంతో పుట్టి పెరిగారు. భిన్న రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోన్ కురెన్జిత్ కౌర్ వొహ్రా.. ఈ పేరుతో గుర్తు పట్టడం కష్టం. ‘సన్నీ లియోన్’ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేయవచ్చు. మూలాలను బట్టి చూస్తే సన్నీ సగం భారతీయురాలు. సన్నీ తల్లి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళ. తండ్రి టిబెట్ వ్యక్తి. వాళ్లిద్దరి ప్రేమకు ప్రతీక సన్నీ. వాళ్లు కెనడాలో సెటిలయ్యారు. పుట్టుకతోనే సన్నీకి ఆ దేశ పౌరసత్వం లభించింది. ఈ విధంగా సన్నీకి మూడు దేశాలతో అనుబంధం ఉంది. కత్రినాకైఫ్ ఈ బ్యూటీ పుట్టి పెరిగింది హాంకాంగ్‌లో. అప్పట్లో హాంకాంగ్ బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది. కత్రినా తండ్రి మహ్మద్ కైఫ్ కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి. దశాబ్దాలకు పూర్వమే ఆయన బ్రిటన్ వెళ్లాడు. అక్కడ సుసన అనే బ్రిటీష్ మహిళను వివాహం చేసుకున్నాడు. వాళ్ల ఏడుగురి సంతానంలో కత్రినా ఒకరు. ఆ మధ్య ఒకసారి తనను ‘హాఫ్ ఇండియన్’గా చెప్పుకుంది కత్రినా. అంజలి టెండూల్కర్ అంజలి టెండూల్కర్.. పెళ్లికి ముందు అంజలి మెహతా. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అంజలి గుజరాతీ కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి గుజరాతీ వ్యాపారవేత్త. అంజలి తల్లి మాత్రం బ్రిటిషర్. వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. ఈ విధంగా అంజలిలో బ్రిటిష్ మూలాలున్నాయి. గుత్తాజ్వాలా బ్యాడ్మింటన్ గేమ్‌లో చైనా ఆధిపత్య స్థాయిలో ఉంటుంది. ఇప్పుడి ప్పుడే భారత్ నుంచి వస్తున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు చైనా ప్లేయర్లకు సవాలు విసరుతున్నారు. ఇలాంటి పోటీ ఉన్న రెండు దేశాల మూలాలను కలిగి బ్యాడ్మింటన్‌లోనే ప్రతిభను కనబరుస్తున్న షట్లర్ గుత్తాజ్వాలా. తండ్రి తెలుగు వ్యక్తి... తల్లి చైనా మహిళ. ఇలా భిన్నమైన మూలాలున్నాయి ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కి. లీసారే నటిగా, మోడల్‌గా, సామాజిక ఉద్యమకారిణిగా గుర్తింపు ఉన్న వ్యక్తి లీసారే. ప్రస్తుతానికి కొంత ప్రభ తగ్గినా గ్లామర్ ఫీల్డ్‌లో లీసారే గుర్తుండి పోతుంది. ఈమె కూడా రెండు దేశాల మూలాలున్న, మూడు దేశాలతో అనుబంధం ఉన్న వ్యక్తి. తండ్రి బెంగాలీ హిందూ, తల్లి ఒక పోలిష్ మహిళ. కెనడాలో స్థిరపడిన ఆ ఇద్దరి గారాల పట్టి లీసారే. -
విలువైన కథ-నేపథ్యం
కథలు రాసేవారికీ కథలు చదివేవారికీ ఫలానా కథ ఎలా పుట్టింది, ఈ రచయితకు ఆ ఆలోచన ఎప్పుడు తట్టింది, తట్టిన ఆలోచనను అతడు కథగా ఎలా మలిచి ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఎటువంటి సాధకబాధకాలు పడి ఉంటాడు అని తెలుసుకోవాలనిపించడం కద్దు. గొప్ప గొప్ప కథలు- అవి కలిగించవలసిన చైతన్యాన్ని కలిగించడమేగాక తమ పుట్టుక గురించి కూడా కుతూహలం కలిగిస్తాయి. అవి తెలుసుకోవడం అంటే ఆ కథలను మరింత అక్కున జేర్చుకోవడమే. అంతే కాదు కథకులు, కొత్త కథకులు కొత్తపాఠాలను అనుభవాలను తెలుసుకోవడమే. గతంలో కథ-నేపథ్యం మొదటి భాగం వచ్చింది. అందులో అబ్బూరి ఛాయాదేవి, కాళీపట్నం రామారావు, కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు వంటి సుప్రసిద్ధ కథకులు 25 మంది తమ కథల నేపథ్యం చెప్పారు. మరో 34 మంది కథలతో నేపథ్యాలతో ‘కథ నేపథ్యం-2’ వచ్చింది. ఒక పత్రికలో పాత్రికేయుడిగా పని చేస్తున్నప్పుడు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుకు వచ్చిన ఆలోచన వల్ల ఈ శీర్షిక తదనంతరం ఈ విలువైన సంకలనాలు ఇవాళ తానా సహకారంతో పాఠకులకు అందాయి. కథ నేపథ్యం-2లో అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, ఆర్.వసుంధరాదేవి, ఓల్గా, కాట్రగడ్డ దయానంద్, గీతాంజలి, తోలేటి జగన్మోహనరావు, పెద్దింటి అశోక్ కుమార్, మధురాంతకం నరేంద్ర, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, సి.రామచంద్రరావు, పి.చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రసిద్ధ రచయితలు అనేకమంది తమ కథల్లో ఒక కథను ఎంచుకుని అది రాయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. అయితే ఇవి ఒట్టి నేపథ్యాలు కాదు. సాంఘిక ఘటనలు. పరిణామక్రమాలు. తెలుగు సమాజపు ఒడిదుడుకుల్లో కొండగుర్తులు. స్త్రీ-పురుష లేదా మానవ సంబంధాల్లో వచ్చిన వస్తున్న మార్పులకు పెను సూచికలు. ముఖ్యంగా తెలంగాణ రచయితలు అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్ కుమార్; రాయలసీమ కథకులు వి.ఆర్.రాసాని, సన్నపురెడ్డి; స్త్రీ రచయితలు గీతాంజలి, చంద్రలత వీరి నేపథ్యాలు ప్రతి ఒక్కరూ చదవదగ్గవి. తెలుగు ప్రాంతంలోని రచయితలకు మాత్రమే పరిమితం కాకుండా అమెరికా నుంచి రాస్తున్న ఆరి సీతారామయ్య, చంద్ర కన్నెగంటి, వేలూరి వెంకటేశ్వరరావులకు చోటు కల్పించడం సబబుగా ఉంది. వీరిలో వేలూరి రాసిన కథా నేపథ్యం అమెరికా వలస చరిత్రను సూక్ష్మంగా తెలియచేస్తుంది. ఇదొక్కటే కాదు ఓల్గా- ‘అయోని’ కథ నేపథ్యం స్త్రీవాదపు ఒక కోణాన్ని చూపితే, తోలేటి ‘మగోడు’ నేపథ్యం అదే స్త్రీవాదపు మరో కోణాన్ని చూపుతుంది. ఇక రచనకు సంబంధించి రచయితలిచ్చిన టిప్స్ సరేసరి. అయితే ఇటువంటి ప్రయత్నాల్లో లోపాలు వెదకడం సులువు. అర్హత ఉన్న అందరికీ చోటు కల్పించడం ఎలాగూ వీలు పడదు కనుక ఇటువంటప్పుడు సంపాదకులుగా ఉన్నవారు సాధారణంగా తమ రచనలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. కాని ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు తన కథ ఇందులో వేసుకోవడం వల్ల మా కథ ఎందుకు లేదు అని అడిగే అవకాశం ఇచ్చినవారయ్యారు. ఏ కారణం వల్లనైనాగాని వాడ్రేవు చినవీరభద్రుడు, దాదాహయత్, ముదిగంటి సుజాతరెడ్డి, గోపిని కరుణాకర్ల కథలు లేకపోవడం వెలితి. అలాగే పతంజలిశాస్త్రి, జి.ఆర్.మహర్షి, సుంకోజి దేవేంద్రాచారిల కథలు కూడా ఉంటే బాగుండేది. సుంకోజి నేపథ్యానికీ ఆ నేపథ్యంలో నుంచి ఆయన చేసిన సుదీర్ఘ కథా ప్రయాణానికీ తగిన గౌరవం ఇవ్వకపోవడం అసమంజసం. అలాగే 2005 నుంచి కథలు రాస్తున్న అజయ్ ప్రసాద్‌కు చోటు ఇవ్వడం వల్ల అంతకు ముందు నుంచి రాస్తున్న కె.ఎన్.మల్లీశ్వరి, దగ్గుమాటి పద్మాకర్, జి.ఉమామహేశ్వర్, స్కైబాబా, సువర్ణముఖి, కె.వి.కూర్మనాథ్, జి.వెంకటకృష్ణ, ఒమ్మి రమేశ్‌బాబు, డా.ఎం.హరికిషన్... తదితర రచయితలను ఎందుకు మినహాయించారు అనే ప్రశ్న రావచ్చు. ఇక రెండు సంకలనాల్లోని 59 కథల్లో కేవలం 8 మాత్రమే తెలంగాణవారివి. ఈ సంఖ్య వారిని నొప్పించవచ్చు. ఈ గమనింపులని రాబోయే సంకలనాల్లో స్వీకరిస్తారని ఆశిద్దాం. తెలుగు సాహిత్యంలో కథకు చేయదగ్గ సేవ బహుముఖాలుగా సాగాలని కోరుకుందాం. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి ఈ ముగ్గురూ ఉమ్మడి సంపాదకత్వంలో చేసిన ఈ ప్రయత్నానికి అభినందనలు తెలుపుదాం.రచయితలు, విమర్శకులు, పాఠకులు, ఔత్సాహికులు తప్పని సరిగా పరిశీలించదగ్గ పుస్తకం కథ నేపథ్యం - 2. - నెటిజన్ కిశోర్ కథ నేపథ్యం; 34 మంది కథకుల ఉత్తమ కథలు వాటి నేపథ్యాలు తానా ప్రచురణ; వెల: రూ. 350; ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు సంపాదకుల నం: 9985425888, 7207210560 -
పద్ధతులే దిద్దుతాయి!
పిల్లల పెంపకం చాలా ఈజీ అట! అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి అంటున్నారు. ఈజీనా! ఇక్కడంతా కిందమీద అవుతుంటే... చలం ‘బిడ్డల శిక్షణ’ని,నామిని ‘ఇస్కూలు పుస్తకాల్ని’ ముందేస్కుని కూర్చుంటే... ఈయనేమో వెరీ సింపుల్ అని తేల్చేస్తారా? రస్నా యాడ్‌తో బుట్టలో వేసుకున్నంత మాత్రాన... ఏం చెప్పినా పిల్లలు వినేస్తారనుకోవడమేనా! ఈమాటకు చిన్న స్మైల్ ఇస్తారు లీల, గోపాలకృష్ణలు. ‘ఎవరు చెప్పమన్నారు?’ అని ఆ నవ్వులకర్థం! చెప్పకుండా ఎలా? ‘చెప్పాలి... కానీ చెప్పీచెప్పనట్లు, చేసీ చూపినట్లు.’ ఇదే... లీలపాఠం, గోపాలపాఠం... ఈవారం మన ‘లాలిపాఠం’ కూడా. ఎనభైలలో టీవీ సామాన్యులకు అందివచ్చిన రోజులవి. వాణిజ్య ప్రకటనలను కూడా ఆసక్తిగా చూసిన కాలం. చక్కగా సూట్, కోట్ ధరించిన క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ నటులు తమ హుందాతనానికి కారణం ఈ దుస్తులే అన్నట్లు పోజిచ్చేవారు... బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఓన్లీ విమల్’ అనే వాయిస్ వినిపించేది, అది విమల్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ప్రకటన. అలాగే ఫిబ్రవరి దాటి మార్చినెలలో అడుగుపెట్టామంటే ‘పదేళ్లు నిండని పాప ఎర్రని సాఫ్ట్ డ్రింకు తాగుతూ ఆ గ్లాసును బుగ్గకు తాకించుకుని ‘ఐ లవ్ యూ రస్నా’ అనేది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... కలకాలం గుర్తుండిపోయిన ఈ ప్రకటనల రూపకర్త అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి దంపతులు వాళ్ల పిల్లలను పెంచిన విధానమే ఈ వారం మన లాలిపాఠం. మీ పిల్లల వివరాలు చెప్తారా? లీల: మాకు ముగ్గురమ్మాయిలు, ఒకబ్బాయి. అనూరాధ, సుధారాణి, సుజాత, కల్యాణ్. యాడ్ ఏజెన్సీ నిర్వహణతోపాటు మైకా (ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్) విద్యాసంస్థను స్థాపించి శిక్షణనిచ్చిన యాడ్ ఎక్స్‌పర్ట్‌గా మీ పిల్లలను ఎలా తీర్చిదిద్దారు? కృష్ణమూర్తి: మేము పిల్లలను పెంచాం అంతే, ఇక తీర్చిదిద్దుకోవడం అంటారా... వాళ్లను వాళ్లే తీర్చిదిద్దుకున్నారు. నా ఉద్యోగం, వ్యాపారరీత్యా 45 ఏళ్లు గుజరాత్లో ఉన్నాం. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సౌమ్యంగా వ్యాపారం చేసుకోవడానికి అనువైన గుజరాత్ సమాజం కూడా కారణమే అనుకుంటాను. గుజరాత్ సామాజిక వాతావరణం మనకు భిన్నంగా ఉంటుందంటారా? కృష్ణమూర్తి: అక్కడివాళ్లు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువమంది చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తుంటారు. ‘లాభనష్టాల రిస్కుతో కూడిన వ్యాపారంకంటే చదువుకుని ఉద్యోగం చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇస్తే... ‘చదువుకున్న వాళ్లకు మేము ఉద్యోగాలిస్తాం’ అంటారు. అహ్మదాబాద్ ఐఐఎంలో గుజరాతీలకంటే బయటి రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉంటారు. పిల్లలకు మీరు నేర్పించినదేమీ లేదంటారా? కృష్ణమూర్తి: తెలుగు మాట్లాడడం అలవాటు చేశాను. జాతీయస్థాయిలో రాణించడానికి ఇంగ్లిష్ మీడియంలో చదివించాను, గుజరాత్లో సెకండ్ లాంగ్వేజ్‌గా గుజరాతీ చదివారు. అయినా పిల్లలెవర్నీ తెలుగు భాషకు దూరం కానివ్వలేదు. మేము నేర్పించిందల్లా మాతృభాష మీద మమకారం, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం మాత్రమే. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? కృష్ణమూర్తి: ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు పిల్లల మీద నూటికి నూరు శాతం తల్లిదండ్రుల ప్రభావమే ఉంటుంది. పెద్దయ్యేకొద్దీ వాళ్లపరిధి విస్తరించి సమాజం ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ ప్రభావం... తల్లిదండ్రులు ఇంట్లో ఎనిమిది- పదేళ్ల వరకు వేసిన పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పునాదే పిల్లలను చక్కటి పౌరులను చేస్తుంది. ఇంట్లో సంస్కారవంతమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవడం, మంచి స్కూల్లో చేర్పించడం... ఈ రెండూ జాగ్రత్తగా చేస్తే చాలనుకునేవాణ్ని. మంచి స్కూలంటే..? కృష్ణమూర్తి: ఎక్కువ ఫీజులు వసూలు చేసే స్కూల్ కాదు. ఈ స్కూలుకి పిల్లలు ఏయే కార్లలో వస్తున్నారు... వంటివి కాదు. పాఠశాల మోటో ఏంటి, టీచర్ల దృక్పథం ఎలా ఉంది, మన సంస్కృతిని, నైతిక విలువలను నేర్పించే వాతావరణం ఉందా... వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాను. ఏ తరంలోనైనా మధ్యతరగతి జీవితాలు పాటించే విలువలే అత్యున్నతమైన విలువలని నమ్ముతాను. ఆ విలువలు పాటించే స్కూల్లోనే చేర్పించాను. ఇక మిగిలినదంతా ఈవిడే చూసుకున్నది. మరి కాలేజ్ చదువులు... కోర్సుల గెడైన్స్ ఎలా ఉండేది? లీల: ఈయనకేమో పిల్లలు అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎంబిఎ చదివి మా యాడ్ ఏజెన్సీ చూసుకోవడానికి వస్తే బావుణ్నని ఉండేది. కానీ నలుగురిలో ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. పిల్లలు ఏది చదువుతానంటే అదే చదివించాం. పెద్దమ్మాయి బిఎ, రెండో అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ, మూడవ అమ్మాయి ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ కోర్సులు చేశారు. అబ్బాయి బీటెక్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చదివాడు. కృష్ణమూర్తి: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. దానిని ఎవరికి వారు తమకు ఇష్టమైనట్లు జీవించాలి, తమ ఆశలకు ఇష్టాలకు అనుగుణంగా మలుచుకోవాలి. అలా మలుచుకునే స్పేస్‌ని పిల్లలకు ఇవ్వాలి. ‘నేను ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇదే మార్గంలో నడువు’ అని వాళ్ల దారిని మనం నిర్దేశించకూడదు. తమ అభిప్రాయాలకు విలువ ఉందనే భరోసా కలిగించాలి. తర్వాత వాళ్లకు అసంతృప్తి కలిగినప్పుడు ‘అంతా మీరే చేశారు’ అనే అవకాశం ఉంది. ఆ మాట అంటారని మాత్రమే కాదు, అనడానికి ముందు వాళ్లలో కలిగే సంఘర్షణ చిన్నదిగా ఉండదు. వీటన్నింటినీ ఆలోచించి వాళ్లకు ఇష్టమైన ప్రొఫెషన్ని ఎంచుకునే అవకాశాన్నిచ్చాను. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చాం, అన్నీ మేము కుదిర్చిన పెళ్లిళ్లే. మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ నేపథ్యానికి సరిపోతాయనుకున్న సంబంధాలను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ల ముందు పెడితే ఫైనల్ సెలెక్షన్ ఎవరికి వాళ్లే చేసుకున్నారు. బాల్యంలో కథల రూపంలో విలువలు చెప్పే ప్రయత్నం జరిగిందా? లీల: నేను పేదరాశి పెద్దమ్మ కథలు, విదుర నీతి, చందమామ కథలు చెప్పేదాన్ని. ఒకే పెంపకంలో పెరిగినప్పటికీ నలుగురిలో స్పష్టమైన మార్పులు కొన్ని ఉంటాయేమో!? లీల: నిజమే, పెద్దమ్మాయికి ఫ్రెండ్స్ ఎక్కువ. రెండో అమ్మాయి నా కొంగు పట్టుకుని తిరిగేది. మూడో అమ్మాయి గుంటూరులో మా అమ్మ దగ్గర పెరిగింది. ఒకరికొకరికి రెండు- మూడేళ్లు తేడానే. పెద్దమ్మాయికి, అబ్బాయికి మధ్య పదేళ్లు తేడా ఉండడంతో తమ్ముడి బాధ్యత తనే చూసుకునేది. కృష్ణమూర్తి: ఒకే నేపథ్యంలో పెరిగినప్పటికీ పిల్లల్లో మార్పులు అంటే... కోపం, శాంతం వంటి జెనెటికల్‌గా వచ్చే వాటిని ఎవరూ మార్చలేరు. కానీ నడవడిక, మాట, మన్నన వంటివి అమ్మానాన్నల నుంచే నేర్చుకుంటారు కాబట్టి నలుగురినీ ఒకే విధంగా ఉండేటట్లు పెంచవచ్చు. నా ఇన్నేళ్ల కెరీర్లో ‘కృష్ణమూర్తి ఈ విషయంలో అబద్ధం చెప్పాడు, లంచం తీసుకున్నాడు’ వంటి ఆరోపణలు చేసే వాళ్లు లేరు. అంత కచ్చితంగా ఉన్నాను కాబట్టి ఆ మాటను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రభావం పిల్లల మీద ఉండి తీరుతుంది. గుజరాత్ వ్యాపార సంస్కృతిని మీ పిల్లలూ అలవరుచుకున్నారా? లీల: అవును, ముగ్గురమ్మాయిలు కలిసి అహ్మదాబాద్‌లో రెండు బొటిక్స్(దుస్తులు డిజైనింగ్, స్టిచింగ్) పెట్టారు. పెద్దమ్మాయి పెళ్లయిన తర్వాత మిగిలిన ఇద్దరూ చూసుకునేవాళ్లు. ఇప్పుడు కుటుంబాలను చూసుకుంటూ ఇద్దరు హైదరాబాద్, ఒకరు చెన్నైలో ఉంటున్నారు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి టీవీ, రేడియోలను విప్పి సెట్ చేస్తుండేవాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ వైపే వెళ్లాడు. కృష్ణమూర్తి: ఇష్టమైన పనిని ఎన్ని గంటలు చేసినా శ్రమ అనిపించదు. నేను పద్దెనిమిది గంటలు పని చేశానంటే నాకు ఇష్టమైన క్రియేటివ్ ఫీల్డు కాబట్టి చేయగలిగాను. అకౌంట్స్ సాల్వ్ చేయమంటే అరగంట కూడా కూర్చోలేను. అయితే ఆ తరంలో గుంటూరులో మా కుటుంబ నేపథ్యంలో నాకిలా గైడ్ చేసే వాళ్లు లేకపోవడంతో హిస్టరీ చదివి మ్యూజియంలో పనిచేశాను, తర్వాత క్యాలికో మిల్స్ ఉద్యోగం కోసం అహ్మదాబాద్ వెళ్లాను. ముప్పై ఏళ్లకు నాకు సరైన ప్రొఫెషన్ ఏదో తెలుసుకోగలిగాను. అంటే... పిల్లలకు కెరీర్ గెడైన్స్ అవసరమేనంటారా? కృష్ణమూర్తి: గెడైన్స్ అవసరమే కానీ అది ఆదేశం కాకూడదు. మంచిచెడుల గురించి గెడైన్స్ ఇచ్చినట్లే ఇది కూడ. ఎందుకంటే ఎవరి నడకను వాళ్లు నడవాల్సిందే, ఎవరి జీవితాన్ని వాళ్లు జీవించాల్సిందే. ఆ ఫిలాసఫీనే ఎప్పుడూ నమ్ముతాను. మా తరంతో పోల్చుకుంటే ఈ తరం పిల్లలకు ఎక్స్పోజర్ ఎక్కువ. ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్లు ఉన్నాయనే సమాచారం వాళ్ల ముంగిట్లో ఉంటోంది. అందులో, తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే అవకాశాన్ని వాళ్లకే ఇవ్వాలి. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి వాళ్ల నాన్నగారి నుంచి టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. ఆయన రోజూ టంచన్‌గా తొమ్మిదిన్నరకు ఆఫీసులో ఉండేవారు. సొంత ఆఫీసే కదా అని ఆలస్యంగా వెళ్లడం ఆయనకు అలవాటు లేదు. ఇప్పటికీ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఆయన అబద్ధాలు చెప్పరు. పిల్లలకు అదే అలవాటైంది. - లీల మా అమ్మగారు, అత్తమామలు కూడా మాతోనే ఉండేవారు. అలా పిల్లలకు చిన్నప్పటినుంచి గ్రాండ్పేరెంట్స్కి సహాయం చేయడం అలవాటైంది. ఇవన్నీ వ్యక్తిని తీర్చిదిద్దే అంశాలే. మనం బాధ్యతగా ఉంటే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మనం మన అమ్మానాన్నలను, ఇతరులను ఎవరినైనా కించపరిచేటట్లు మాట్లాడితే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మా అమ్మగారితో ఈవిడ పోట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. భార్యాభర్తలు ఇంటిని యుద్ధరంగం చేయకుండా ప్రశాంతంగా ఉంచడంలో సక్సెస్ అయితే పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నట్లే. - కృష్ణమూర్తి