మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌తో టాలీవుడ్‌లో సందడి నెలకొంది. మెగా ఇంట్లో ఈ ఏడాది చివర్లో పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ఈ జంట సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. మిస్టర్ చిత్రంలో తొలిసారి జంటగా కలిసి నటించిన వీరిద్దరు తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారు. గతంలో చాలాసార్లు ఈ జంట గురించి డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: వరుణ్, లావణ్య పెళ్లి జరిగేది అక్కడేనా? ఆ సెంటిమెంట్)
అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అడుగు పెట్టనుండటంతో అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కుటుంబ నేపథ్యం గురించి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 15న 1990లో యూపీలోని ఫైజాబాద్‌లో లావణ్య త్రిపాఠి జన్మించింది.
ఆ తర్వాత లావణ్య ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పెరిగింది. ఆమె తండ్రి లాయర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమె తల్లి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కాగా.. ఆమె అక్క కమిషనర్‌గా పనిచేస్తున్నారు. లావణ్యకు ఓ సోదరుడు కూడా ఉన్నారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన లావణ్య ఆ తర్వాత ముంబయికి షిఫ్ట్ అయింది. ముంబయిలోని రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
(ఇది చదవండి: నేను నా బరువు కోసం కాదు, ఆరోగ్యం కోసం ఆలోచిస్తా: నిర్మాత)
ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో టీవీ షోల్లో కనిపించింది. ఆమె పాఠశాలలో చదివే రోజుల్లోనే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతే కాకుండా శాస్త్రీయ నృత్యంలో కూడా నైపుణ్యం సాధించింది. నానితో నటించిన భలే భలే మగాడివోయ్ భరతనాట్యంతో మెప్పించిన సంగతి తెలిసిందే. హిందీలో ప్యార్ కా బంధన్ అనే టీవీ షో ద్వారా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి.. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment