జగిత్యాల: జగిత్యాలకు చెందిన ఓ బాలుడి మాటలకు కేటీఆర్ ఫిదా అయ్యారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆ వీడియోను షేర్ చేశారు. జగిత్యాలకు చెందిన బండివారి ప్రకాశ్ ఓల్డ్ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. చదువుకుంటూనే ఉదయం సమయంలో ఇంటింటా దినపత్రికలు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రకాశ్‌ను ప్రశంసించి.. చదువుకునే వయస్సులో పనిచేస్తున్నావని అడుగగా, తప్పేముందని తిరిగి ప్రశ్నించాడు.
‘ఈ వయస్సులో నీవు కష్టపడాల్సి వస్తోంది’అని సదరు వ్యక్తి అనగా, కష్టపడితే ఏమవుతుంది, భవిష్యత్‌లో నాకే మేలు జరుగుతుందని’బదులిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ధైర్యాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, ప్రకాశ్ ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ కూడా ముగ్ధుడయ్యారు. ఆ చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరారు. కష్టపడుతూ చదువుకోవడం అభినందనీయమని, బాలుడి ఆత్మవిశ్వాసం తనకు ఎంతో నచ్చిందని ట్వీట్ చేశారు. బాలుడి తండ్రి క్యాబ్ నడుపుతుండగా, తల్లి అనూష టైలరింగ్ చేస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment