యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం
బెంగళూరు: ఓ మహిళ తనకు నచ్చిన దుస్తులు వేసుకున్నందుకు.. యాసిడ్ పోస్తానని సోషల్ మీడియాలో బెదిరించిన ఓ వ్యక్తిని అతని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ‘‘అతనికి నచ్చని దుస్తులు వేసుకున్నందుకు యాసిడ్ పోస్తానని నా భార్యను నికిత్‌శెట్టి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు, వెంటనే ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’’అని జర్నలిస్ట్ షాబాజ్ అన్సార్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
దీనికి కర్ణాటక అధికారులను ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్స్ మహిళకు మద్దతుగా నిలిచారు. నికిత్ శెట్టిపై చర్యలు తీసుకోవాలని అతడు ఉద్యోగం చేస్తున్న సంస్థ ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై నికిత్ శెట్టి యాజమాన్యం స్పందించింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘‘మా ఉద్యోగి మరో వ్యక్తి దుస్తుల ఎంపిక గురించి బెదిరించడం మాకు బాధ కలిగించింది. ఈ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు.
ఇది మా విలువలకు విరుద్దం. మేం నికిత్ శెట్టిని తొలగిస్తున్నాం. అతనిపై ఫిర్యాదు చేశాం. కేసు నమోదు అయ్యింది’’అని ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్ తెలిపింది. అయితే తన భార్యను బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న కంపెనీకి, అందుకు మద్దతు తెలిపిన పలువురు నెటిజన్స్‌కు అన్సార్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment