ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు | Deepika Padukone Celebrate Her Birthday with women injured in acid attack - Sakshi
Sakshi News home page

వారితో ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు

Published Mon, Jan 6 2020 10:57 AM | Last Updated on Mon, Jan 6 2020 1:33 PM

Deepika Padukone Celebrates Her Birthday With Ranveer And Acid Attack Survivors - Sakshi

లక్నో : బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నిన్న(ఆదివారం) తన పుట్టినరోజును వేడుకగా జరుపుకున్నారు. ఈ రోజుతో దీపికా 34వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. దీంతో సోషల్‌ మీడియాలో ఇటు బాలీవుడ్‌ ఇండస్టీతోపాటు అటు ప్రముఖుల నుంచి  దీపికాకు భర్త్‌డే విషెస్‌ హోరెత్తాయి. కత్రినా కైఫ్‌, అలియాభట్‌, మాధురి దీక్షిత్‌, తమన్నా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఇంతటి ఆనంద రోజును దీపికా ఇంకా ప్రత్యేకం చేసుకున్నారు. తన పుట్టిన రోజును లక్నోలో యాసిడ్‌ దాడిలో గాయపడిన మహిళల సమక్షంలో జరుపుకున్నారు. ఈ వేడుకలో భర్త రణ్‌వీర్‌, విక్రాంత్‌ మాసే తప్ప బాలీవుడ్‌ తారలు ఎవ్వరూ లేకపోవడం విశేషం. 

భర్త రణ్‌వీర్‌, ఛపాక్‌ నటుడు విక్రాంత్‌ మాసే, లక్ష్మీ అగర్వాలోపాటు యాసిడ్‌ బాధితులతో కలిసి దీపికా కేక్‌ కట్‌ చేసి సంతోషంగా గడిపారు. బర్త్‌డేకు సంబంధించిన ఫోటోలు లక్ష్మీ అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అలాగే పార్టీలో దీపికా కేకు కట్‌ చేసిన వీడియోను ఓ అభిమాని షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వేడుకలో దీపికా తన రాబోయే చిత్రం ఛపాక్‌ను ప్రమోట్‌ చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకలకు ఆదివారం ఉదయమే దీపికా, రణ్‌వీర్‌ లక్నోకు చేరుకున్నారు. దీనికి ముందు ముంబై ఎయిర్‌పోర్టులో అభిమానులు తీసుకు వచ్చిన కేకును దీపికా కట్‌ చేశారు. కాగా ప్రస్తుతం ఛపాక్‌ సినిమా ప్రమోషన్లలో దీపికా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షించడానికి పలు ప్రోగ్రామ్స్‌లో, రియాల్టీ షోలో ఆమె పాల్గొంటున్నారు. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement