బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే పేరు మరో సారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. గత ఏడాది ప్రియుడు రణవీర్‌ను పెళ్లాడిన దీపిక తల్లికాబోతున్నారన్న వార్త బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తతుం ఛాపాక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న దీపికకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఛాపాక్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను మీడియా వారు ‘మీరు తల్లి కాబోతున్నారా..?’ అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు దీపిక ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను గర‍్భవతిని కాదని చెప్పిన దీపిక.. పెళ్లైన వెంటనే తల్లి కావాలా..? అంటూ ప్రశ్నించింది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. పెళ్లైన వాళ్లను పిల్లల గురించి అడిగి విసిగించడం ఎందుకు అంటూ దీపిక ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఛాపాక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా 2020 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment