రణ్‌వీర్‌ పుట్టినరోజు.. దీపికా కామెంట్‌ | Deepika Padukone Has a Birthday Surprise For Ranveer Singh | Sakshi
Sakshi News home page

రణ్‌వీర్‌ పుట్టినరోజు.. దీపికా కామెంట్‌

Published Mon, Jul 6 2020 2:17 PM | Last Updated on Mon, Jul 6 2020 2:35 PM

Deepika Padukone Has a Birthday Surprise For Ranveer Singh - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ సోమవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సోమవారంతో రణ్‌వీర్‌ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా దీపికా పదుకొనె తన భర్త రణ్‌వీర్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో వచ్చిన ‘లుటేరా’ సినిమా విడుదలై ఇవాళ్టికి ఏడేళ్లు పూర్తవుతోంది. ఫేమస్ రైటర్ ఓ.హెన్రీ పాపులర్ రచన ‘ది లాస్ట్ లీఫ్’ ఆధారంగా తయారైన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించారు. ​అయితే బాక్సాఫిస్‌ వద్ద ఈ సినిమా బోల్తా పడినప్పటికీ రణ్‌వీర్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రణ్‌వీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనిపై దీపికా, సోనాక్షి, మోట్వాన్‌ వంటి వారితో పాటు అనేక మంది తారలు స్పందిస్తున్నారు.

‘నీ ఉత్తమమైన నటనలో లుటేరా ఒకటి’ అంటూ రణ్‌వీర్‌ అర్థాంగి దీపికా కామెంట్‌ చేశారు. ‘నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ మూవీ’ అంటూ సోనమ్‌ బజ్వా. ‘ఈ సినిమాలో నీ నటనతో మా హృదయాలను గెలుచుకున్నారు’ అని సాహిల్‌ ఖత్తర్‌ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ 83 చిత్రంలో నటిస్తున్నారు. 1983లో  భారత జట్టు మొదటిసారి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌, ఆయన భార్య రోమీ పాత్రలో దీపికా కనిపించనున్నారు. ఏప్రిల్‌ 10న విడుదల చేయాలనుకున్నప్పటికీ... కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement