![Chennai: Woman Throwing Acid And Tries To Kill Daughter In Law Cuddalore - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/14/woman_0.jpg.webp?itok=V89hdoY2)
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(చెన్నై): కడలూరు జిల్లాలో కోడలిపై ఆసిడ్ పోసి హత్యాయత్నం చేసిన అన్నాడీఎంకే మహిళా నాయకురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన కలివరదన్ భార్య ఆండాళ్ విరుదాచలం అన్నాడీఎంకే ఉప కార్యదర్శిగా ఉన్నారు. వీరి కుమారుడు ముకేష్ రాజ్. ఇతని భార్య కృతిక (26). వీరికి రిషిత (5), రిషిక (1) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈ క్రమంలో కృతికపై అనుమానం పెంచుకున్న అత్త ఆండాలు కోడల్ని తరచూ వేధింపులకు గురి చేసేది. ఆదివారం రాత్రి ఆండాళ్‌కు కృత్తికకు గొడవలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృత్తిక ఇంటిలో నిద్రపోతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆండాలు టాయిలెట్‌కు ఉపయోగించే ఆసిడ్‌ను కృత్తిక ముఖంపై పోసి నోటిలో కూడా పోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. కృత్తిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు దీనిపై విరుదాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృత్తికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆండాలును అరెస్టు చేశారు.
చదవండి: ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment