యువతిపై యాసిడ్‌ దాడి | Young Man Acid Attack to Women in Vizianagaram | Sakshi
Sakshi News home page

యువతిపై యాసిడ్‌ దాడి

Mar 7 2019 8:34 AM | Updated on Mar 7 2019 8:34 AM

Young Man Acid Attack to Women in Vizianagaram - Sakshi

బాధిత యువతిని విచారిస్తున్న ఎస్సై మహేష్‌

పార్వతీపురం: పట్టణంలోని వేమకోటివారి వీధికి చెందిన ఓ యువతిపై శివశంకర్‌ అనే యువకుడు యాసిడ్‌ పోసిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై ఉప్పిలి మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వేమకోటవారివీధిలో నివాసం ఉంటున్న యువతిని పట్టణానికి చెందిన శివశంకర్‌ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటబడేవాడు. అయితే కొంతకాలంగా ఉద్యోగం కోసం శివశంకర్‌ దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ నుంచి ఆమెకు మెసేజ్‌లు పంపించడం చేసేవాడు.

అయితే ఆ యువతి అతని ప్రేమను తిరస్కరించడంతో... తీవ్ర ఆగ్రహానికి లోనైన శివశంకర్‌ ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చేశాడు. ఈ క్రమంలో బుధవారం బాధిత యువతి ఇంటికెళ్లి ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఆ సమయంలో యువతి ముఖం పక్కకు తిప్పడంతో మెడపై యాసిడ్‌ పడింది. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి నుంచి ఎస్సై వివరాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement