ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఆగ్రాలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసిన ఘటన శుక్రవారం కందరిలో వెలుగు చూసింది. ఈ ఘటనలో సదరు యువకుడి శరీరం తీవ్రంగా గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు యువతిపై హరి పర్వత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆగ్రా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఆగ్రాకు చెందిన దేవేంద్ర రాజ్‌పుత్(28), నిందితురాలు సోనమ్ ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతేగాక కొంతకాలంగా వారిద్దరూ ఓ అద్దె ఇంట్లో కలిసి ఉంటు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుడు దేవేంద్రకు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇదే విషయం అతడిని అడుగగా తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని తెల్చి చెప్పాడు.
దీంతో బాయ్‌ఫ్రెండ్‌పై ఆగ్రహంతో ఉన్న సోనమ్ పథకం ప్రకారం సీలింగ్ ఫ్యాన్ రీపెర్ పేరుతో మృతుడు దేవేంద్రను ఇంటికి పిలిచింది. ఈ క్రమంలో సమయం చూసి ఒక్కసారిగా అతడిపై యాసిడ్ కుమ్మరించింది.ఈ ఘటనలో సోనమ్‌కు కూడా గాయాలయ్యాయి. అయితే తీవ్రంగా గాయపడ్డ దేవేంద్ర చికిత్స పొందుతూ శుక్రవారం మరణించినట్లు ఆగ్రా ఎస్పీ బీఆర్ ప్రమోద్ వెల్లడించారు. మృతుడి తల్లిదండ్రుల సోనమే తమ కుమారుడిపై యాసిడ్ దాడి చేసినట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు. ఈ మేరకు సదరు యువతిపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు జరగుతున్నట్లు ఏస్పీ తెలిపారు.
చదవండి:
తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్‌చేస్తే న్యూడ్ వీడియో కాల్
సినిమా బ్యానర్ మార్చి ఓటీటీకి.. సహా నిర్మాతపై ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment