పరీక్షకు వచ్చిన విద్యార్థినిపై యాసిడ్‌ దాడి! | Karnataka: 23-Year-Old Abin Throws Acid On Three College Girls In Mangalore - Sakshi
Sakshi News home page

Mangaluru: పరీక్షకు వచ్చిన విద్యార్థినిపై యాసిడ్‌ దాడి!

Published Mon, Mar 4 2024 12:50 PM | Last Updated on Mon, Mar 4 2024 1:19 PM

MBA Boy Throws Acid on Minor Girl - Sakshi

కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కడబా ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు స్థానిక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. 

ఆ బాలిక సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద కాపుగాసిన 23 ఏళ్ల అబిన్‌ ఆమెపై యాసిడ్‌ విసిరాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబిన్ కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉంది. నిందితుడు అబిన్‌ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement