ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న కళాకారిణిపై యాసిడ్‌ దాడి | Karnataka: Acid Attack On Theatre Actress Three Arrested | Sakshi
Sakshi News home page

ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న కళాకారిణిపై యాసిడ్‌ దాడి

Published Mon, Mar 21 2022 7:27 AM | Last Updated on Mon, Mar 21 2022 8:39 AM

Karnataka: Acid Attack On Theatre Actress Three Arrested - Sakshi

యశవంతపుర(బెంగళూరు): రంగస్థల కళాకారిణి దేవిపై యాసిడ్‌ దాడికి పాల్పడిన రమేశ్, స్వాతి, యోగేశ్‌ అనేవారిని నందిని లేఔట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నందినిలేఔట్‌ గణేశ్‌బ్లాక్‌లో ఉంటున్న దేవి బీఎంటీసీ కండక్టర్‌గా పనిచేసి రాజీనామా చేసింది. కొన్ని­రోజుల నుంచి నాటక కళాకారిణిగా ప్ర­ద­ర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దేవిపై ముగ్గురూ యాసిడ్‌ దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మరో ఘటనలో..

వేర్వేరుగా ఇద్దరు ఆత్మహత్య
హోసూరు: బాగలూరు సమీపంలో వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొన్నారు. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని బెగ్గిళి గ్రామానికి చెందిన నాగరాజ్‌ (35) కొంత మంది వద్ద అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో నాగరాజ్‌ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. నందిమంగలం ప్రాంతానికి చెందిన కూలికార్మికుడు నారాయణన్‌ (56)కు తాగుడు అలవాటుండడంతో భార్యాభర్తల మద్య తరచూ గొడవలేర్పడుతుండేది. శనివారం రాత్రి జరిగిన గొడవల్లో ఆవేశం చెందిన నారాయణన్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు ఘటనల్లోనూ పోలీసులు కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement