కన్హయ్యను చంపేయండన్న వ్యక్తి ఖాతాలో రూ.150 | Man who offered Rs 11 lakh to kill Kanhaiya has Rs 150 in bank, owes rent for months | Sakshi
Sakshi News home page

కన్హయ్యను చంపేయండన్న వ్యక్తి ఖాతాలో రూ.150

Published Mon, Mar 7 2016 11:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

కన్హయ్యను చంపేయండన్న వ్యక్తి ఖాతాలో రూ.150

కన్హయ్యను చంపేయండన్న వ్యక్తి ఖాతాలో రూ.150

న్యూఢిల్లీ: జేఎన్యూ వివాదంతో ఒక్కసారిగా తనవైపు దేశాన్ని తిరిగి చూసేలా చేసిన వర్సిటీ పీహెచ్డీ స్కాలర్ కన్హయ్య కుమార్ను హత్య చేస్తే వారికి రూ.11 లక్షలు చెల్లిస్తానంటూ ఆఫర్ చేసిన ఆదర్శ శర్మ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.150మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అతడు కొద్ది నెలలుగా అతడు ఉంటున్న గదికి అద్దె కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. బిహార్లోని బెగుసారాయ్కు చెందిన ఆదర్శ శర్మ ది పుర్వాంచల్ సేనకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.

రోహిణీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలె కన్హయ్య కుమార్ను చంపినవారికి రూ.11 లక్షలు చెల్లిస్తామంటూ పత్రికలు వీధివీధిన దర్శనమిచ్చాయి. వాటిపై పూర్వంచల్ సేన లోగోతోపాటు ఆదర్శ శర్మ సంతకం కూడా ఉంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఆదర్శ చీకట్లోకి వెళ్లిపోయాడు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకోవడమే కాకుండా దాదాపు అన్ని కమ్యూనికేషన్స్ కట్ చేసుకున్నాడు. 'ఎవరూ జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ను కాల్చిపారేస్తారో వారికి పూర్వాంచల్ సేన రూ.11లక్షలు బహుమతిగా ఇస్తుంది' అని శనివారం పోస్టర్లు వెలుగుచూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement