న్యూఢిల్లీ: జవహర్ లాల్ యూనివర్శిటీ(జేఎన్ యూ) విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాల్చి చంపితే రూ. 11 లక్షలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు న్యూఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఆయనను పోలీసులు ప్రశ్నించారు.
దేశద్రోహి కన్హయ్యకుమార్ ను కాల్చిచంపితే 11 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ఆదర్శ్ శర్మ కొడుకు పేరుతో ఢిల్లీ వీధుల్లో హిందీలో వెలిసిన పోస్టర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొబైల్ నెంబర్ వివరాలతో సహా ముద్రించిన ఈ తాజా పోస్టర్లు వివిధ బస్టాప్ లు, మెట్రో స్టేషన్ సెంటర్లలో సంచలనంగా మారాయి.
భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే.. కన్హయ్య కుమార్ నాలుక కోస్తే 5లక్షల రూపాయలు కానుకగా ఇస్తానని ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నారు. కాగా, దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్ ఈ నెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆదర్శ్ శర్మ అరెస్ట్
Published Mon, Mar 7 2016 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement