Rs 11 lakh
-
నకిలీ వెబ్సైట్లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే?
ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు చాలా పెరిగిపోయాయి. ఆదమరిస్తే డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. ఇలాంటి సంఘటలను గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరుకు చెందిన 43ఏళ్ల వ్యాపారవేత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో భాగంగా నకిలీ కేఎఫ్సి వెబ్సైట్లో రూ. 11 లక్షలు కోల్పోయాడు. దీనిపైన ఈస్ట్ CEN పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి అతడు ఫ్రాంచైజీని కొనుగోలు చేసి నగరంలో అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడానికి కేఎఫ్సి సంప్రదింపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసారు. అతడు ఓపెన్ చేసిన కేఎఫ్సి వెబ్సైట్ అతనికి సంబంధించిన వివరాలు కోరింది. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. వారు కేఎఫ్సి ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. వారు అతనితో మాట్లాడిన తరువాత ఒక ఇమెయిల్ వచ్చింది. దీని ద్వారా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. దాదాపు ఒక నెల రోజులు సంభాషణ తరువాత అతని అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి డబ్బు అడిగారు. నిజమని నమ్మిన వ్యాపారవేత్త రూ. 11.8 లక్షలు బదిలీ చేసాడు. వారికి డబ్బు పంపిన తరువాత వారు ఎటువంటి సమాచారం అందించకపోగా.. ఆ కాంటాక్ట్ నంబర్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించి.. మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులకు పిర్యాదు చేసాడు. కేఎఫ్సి నోటీసు: కేఎఫ్సి తన అధికారిక వెబ్సైట్లో ఇటువంటి మోసాలు & నకిలీ కేఎఫ్సి ఫ్రాంచైజీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేసింది. బ్రాండ్ పేరుతో మోసం చేసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా మోసపూరిత వెబ్సైట్లు ఉన్నాయని తెలిపింది. కావున వినియోగదారులు చాలా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది. -
కన్హయ్యను చంపేయండన్న వ్యక్తి ఖాతాలో రూ.150
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదంతో ఒక్కసారిగా తనవైపు దేశాన్ని తిరిగి చూసేలా చేసిన వర్సిటీ పీహెచ్డీ స్కాలర్ కన్హయ్య కుమార్‌ను హత్య చేస్తే వారికి రూ.11 లక్షలు చెల్లిస్తానంటూ ఆఫర్ చేసిన ఆదర్శ శర్మ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.150మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అతడు కొద్ది నెలలుగా అతడు ఉంటున్న గదికి అద్దె కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. బిహార్‌లోని బెగుసారాయ్కు చెందిన ఆదర్శ శర్మ ది పుర్వాంచల్ సేనకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. రోహిణీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలె కన్హయ్య కుమార్‌ను చంపినవారికి రూ.11 లక్షలు చెల్లిస్తామంటూ పత్రికలు వీధివీధిన దర్శనమిచ్చాయి. వాటిపై పూర్వంచల్ సేన లోగోతోపాటు ఆదర్శ శర్మ సంతకం కూడా ఉంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఆదర్శ చీకట్లోకి వెళ్లిపోయాడు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకోవడమే కాకుండా దాదాపు అన్ని కమ్యూనికేషన్స్ కట్ చేసుకున్నాడు. 'ఎవరూ జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను కాల్చిపారేస్తారో వారికి పూర్వాంచల్ సేన రూ.11లక్షలు బహుమతిగా ఇస్తుంది' అని శనివారం పోస్టర్లు వెలుగుచూశాయి. -
రూ. 11 లక్షల విలువైన గుట్కాలు పట్టివేత
విజయనగరం : అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీల లోడును పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా బొమ్మలక్ష్మిపురం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు..ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ లారీలో గంగాం జిల్లా నుంచి కొరాపూర్ జిల్లాకు గుట్కా, ఖైనీలను రాష్ట్రం గుండా అక్రమంగా తర లిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించగా గుట్కా లోడు బయటపడింది. అనంతరం లారీని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న లోడ్ విలువ దాదాపు రూ.11 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (బొమ్మలక్ష్మిపురం)