'మోదీ సూట్‌ మాత్రమే మారుతోంది' | Kanhaiya Kumar Slams modi goverment | Sakshi
Sakshi News home page

'మోదీ సూట్‌ మాత్రమే మారుతోంది'

Published Sat, Jul 29 2017 4:25 PM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM

'మోదీ సూట్‌ మాత్రమే మారుతోంది' - Sakshi

'మోదీ సూట్‌ మాత్రమే మారుతోంది'

కడప: ప్రధానమంత్రి సూట్లు మారుతున్నాయి తప్పితే దేశం స్థితిగతులు మారడం లేదని జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయకుమార్ వ్యాఖ్యానించారు. శనివారం కడప జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో జీవించే హక్కు ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని, దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు.
 
ప్రధానికి ఇజ్రాయిల్‌కు వెళ్లడానికి సమయం ఉంది కానీ ఢిల్లీ పక్కనే ఉన్న ఫరీదాబాదు వెళ్లి అక్కడ దళిత బాధితులను పరామర్శించే సమయం లేదు అని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.15 వేలు బ్యాంకుల్లో జమ అవుతాయని మోడీ చెప్పినా అమలులోకి రాలేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఏటా 12 వేలమంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అలాంటి వాళ్లను ఆదుకునేందుకు బడ్జెట్‌ లేదంటారని, పెద్దలకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారని కన్హయ్య విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement