సెల్ఫీతో మళ్లీ హల్చల్ చేస్తోన్న మానస్ జ్యోతి | Kanhaiya’s ‘attacker’ Manas Jyothi Deka selfie with BJP chief Amit Shah | Sakshi
Sakshi News home page

సెల్ఫీతో మళ్లీ హల్చల్ చేస్తోన్న మానస్ జ్యోతి

Published Mon, Jun 6 2016 9:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

సెల్ఫీతో మళ్లీ హల్చల్ చేస్తోన్న మానస్ జ్యోతి - Sakshi

సెల్ఫీతో మళ్లీ హల్చల్ చేస్తోన్న మానస్ జ్యోతి

పుణె: బీజేపీ చీఫ్ అమిత్ షాతో మానస్ జ్యోతి డేకా దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాషాయ పార్టీకి వీరాభిమానినని చెప్పుకునే మానస్ జ్యోతి గతంలో విమానంలో జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే మానస్ కు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు అప్పట్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఆదివారం పుణేకి వచ్చిన అమిత్ షాతో సెల్ఫీ దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మానస్ మరోసారి తాను బీజేపీ వీరాభిమానినని చెప్పుకున్నాడు. దీంతో కన్హయ్య అభిమానులేకాక చాలామంది నెటిజన్లు విమానంలో దాడివెనుక బీజేపీ హస్తం ఉందని నమ్ముతున్నట్లు కామెంట్లు రాశారు. (చదవండి: విమానంలో కన్హయ్యపై దాడి!)


దివంగత కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ దారశనికతపై ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం పుణె వచ్చిన అమిత్ షాను మానస్ జ్యోతి బృందం కలుసుకుంది. అసోమీ యూత్ బృందానికి ప్రాతినిథ్యం వహిస్తూ షాను కలుసుకున్న మానస్.. సెల్పీ దిగి వెళ్లిపోయాడేగానీ మహాజన్ కార్యక్రమంలో పానకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement