'భారత యువతను సానబెడితే తిరుగుండదు'
పుణె: గత ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. భారత యువతను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. ఆదివారం ఆయన పుణెలో ప్రమోద్ మహజన్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రిన్యూర్ మిషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ జనాభా ఇక్కడ ఉండటం భారత్ అదృష్టం అని అన్నారు. వారందరినీ సరిగా సానబెడితే తిరుగుండదని, భారత్ దృఢమైన దేశంగా మారుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ పనిచేయకుండా నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. ఒక్క స్కిల్ ఇండియా మాత్రమే కాకుండా స్టాండ్ అప్ ఇండియా, ముద్రా బ్యాంక్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు అన్నీ కూడా భారత్లోని నిరుద్యోగితన పారద్రోలేవే అని చెప్పారు.