కన్హయ్య కుమార్ కు ఊరట | Delhi high court stays all disciplinary action against JNUSU president Kanhaiya Kumar, others | Sakshi
Sakshi News home page

కన్హయ్య కుమార్ కు ఊరట

Published Fri, May 13 2016 7:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

కన్హయ్య కుమార్ కు ఊరట

కన్హయ్య కుమార్ కు ఊరట

న్యూఢిల్లీ: జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కన్హయ్యతో పాటు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఇతరులపై జేఎన్ యూ విధించిన క్రమశిక్షణ చర్యలపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ మన్ మోహన్ గవే షరతులతో కూడిన స్టే ఇచ్చారు.

తమపై నమ్మకముంటే జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించింది. ఎటువంటి సమ్మెలు, ధర్నాలకు దిగొద్దని కోరింది. క్రమశిక్షణ ఉల్లఘించారనే ఆరోపణలతో కన్హయ్యకు రూ.10 వేలు, ఖలీద్, భట్టాచార్యలకు రూ. 20 వేలు చొప్పున జేఎన్ యూ అధికారులు జరిమానా విధించారు. దీంతో వీరంతా ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement