మన స్వేచ్ఛకు రక్ష సైన్యమా? | soldiers are freedom protectors? | Sakshi
Sakshi News home page

మన స్వేచ్ఛకు రక్ష సైన్యమా?

Published Sat, Mar 5 2016 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

మన స్వేచ్ఛకు రక్ష సైన్యమా?

మన స్వేచ్ఛకు రక్ష సైన్యమా?

జాతిహితం
 న్యాయమూర్తి కన్హయ్యకు ఉపన్యాసం లేదా సలహా ఇవ్వడం మంచిదే. కానీ సరిహద్దుల్లోని సైనికులను మధ్యలోకి లాగి, వారే మన స్వేచ్ఛలన్నిటినీ పరిరక్షిస్తున్నారనడం ఏమిటి? మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షిస్తున్నది మన రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తదితర వ్యవస్థలే. ఈ కేసులో న్యాయమూర్తి ఉదారంగానే నిర్ణయం తీసుకున్నారు. కానీ అతనింకా దోషే కాదు. అనుమానితుడైనందుకే ఆత్మావలోకనం చేసుకోవడం ఏమిటి?  నిర్దోషిగా రుజువయ్య వరకు దోషే అనే సూత్రీకరణను మన న్యాయవ్యవస్థ ఆమోదించదు.
 
 దారితప్పిన పిల్లలకే అయినా లేక దారితప్పి పోలీసు కస్టడీకి, కోర్టులకు, జైళ్లకు చేరిన పిల్లలకే అయినా అంకుల్‌లాగా సలహాలను గుప్పించే తరుణం ఇది (‘‘బచ్చే’’, ‘‘బత్కే హుయే’’ పదాలు పార్లమెంటులో మానవ వనరుల మంత్రి ఉపయోగించినవే). కాబట్టి ఈ అవకాశాన్ని నే ను మాత్రం ఎందుకు వదులుకోవాలి? అలా సలహాలు ఇవ్వగల ఉన్నత స్థానంలో నిలవడానికి నాకున్న అర్హత ఒక్క వయసే అయినా లెక్కచెయ్యను. అందుకు నన్ను పతాక శీర్షికలకెక్కించి అంకుల్ అని పిలిచినా అభ్యంతరం లేదు. కాబట్టి నేను కూడా కన్హయ్య కుమార్‌కు ఉపన్యాసం దంచడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పిన ఆజాదీ విషయాలన్నీ సరేగానీ, ఇంతకూ ఈ  ‘‘పుంజీవాది’’ (పెట్టు బడిదారీ విధానం) గోల ఏమిటోయ్ కుర్రాడా? దారితప్పిన పిల్లాడా ఏమిటి నీ సమస్య? మనలో మరింత ఎక్కువ మంది సమానులం అయ్యే అవకాశాన్ని సృష్టించేదీ, జేఎన్‌యూ వంటి డజను ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నెల కొల్పడానికి పన్నులను అందించేది ఆ పెట్టుబడిదారీ విధానమే. సోషలిజం దశాబ్దాల తరబడి మనకు ఏమిచ్చిందని? ఇంతవరకు చెప్పేశాను కాబట్టి, భావజాల సరిహద్దుకు అటైనా లేక ఇటైనా ఈ ఏడాది విద్యార్థిగా నిలిచిన ఆ కుర్రాడి కి సమర్థనగానో లేక వ్యతిరేకంగానో సలహాలిస్తున్న కొందరిలో నేనూ  చేరిపోవచ్చు. కానీ నాకు ముగ్గురితో మాత్రమే పేచీ ఉంది, వారితోనే వాదించాల్సి ఉంది.  

దృష్టి మళ్లింపు ప్రహసనం  
 నా సమస్యలు సుస్పష్టమైనవే. వాటిని ఇక్కడ సంక్షిప్తంగానే పేర్కొంటు న్నాను. భీమ్‌సేన్ బస్సీ, అత్యంత అధికంగా మాట్లాడే, అత్యధిక ఊహాత్మకత గల పోలీసు గూఢచారి. ఆయనకు ముందు వివిధ భారతిలోని ఇన్‌స్పెక్టర్ ఈగిల్ మాత్రమే ‘నిర్దోషిగా రుజువయ్యేంత వరకు దోషే’ అనే స్టాలినిస్ట్ న్యాయశాస్త్రంతో నన్ను చచ్చేటంతగా భయపెట్టాడు. నిష్కపటంగా చెబు తున్నా, ఆయన లాకప్‌లో పడేయగా, ఆయన చూస్తుండగానే న్యాయవా దులు చావదన్నిన ‘‘పిలగాళ్ల’’పై నాకు జాలేస్తోంది. తద్వారా బస్సీ వారికి టీ-20 తరహా పునర్విద్యను గరిపినందుకు ఒక పాత్రికేయునిగా నేనాయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన పతాక శీర్షికలకు, ప్రైమ్ టైమ్ చర్చ లకు  బోలెడంత అవకాశాన్ని కల్పించారు. నేటి నిరాశాజనకమైన విచ్ఛిన్న రాజకీయాల కాలంలో ఆయన మనకు బోలెడు నవ్వులను అందించారు. అణ్వస్త్రశక్తియైన మరే దేశ రాజధాని పోలీసు అత్యున్నతాధికారైనా ఇలా తలపై 2.50 కోట్ల డాలర్ల వెల ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాది ట్విటర్ హ్యాండిల్‌కు పారడీని నిజమని నమ్మేసి మొత్తం దేశ పోలీసు వ్యవస్థకంతటికీ ఈ ఉగ్రవాద ముప్పు గురించి హెచ్చరికను జారీ చేయగలరా? ఆయనపై నమ్మకం ఉంచిన  కేంద్ర హోం మంత్రి దాన్ని నమ్మేసేలా చేయగలరా? ఇక ఆ తదుపరి బస్సీ చేసిందంతా దేశ ప్రధాన భూభాగంలో వాడుకలో ఉన్నట్టు  ‘ఆగ్రహించిన పిల్లి స్తంభాన్ని పట్టుకు రక్కేయడమే’.

అదెలా ఉంటుందంటే, ఒక్కసారి బాలీవుడ్ సినిమా చూడండి. ఇది నిజ జీవితంలో, హాలీవుడ్ సినిమా ‘వాగ్ ద డాగ్’కు (కుక్కను ఆడించే తోక) తాత (1997 నాటి ఈ వ్యంగ్య చిత్రంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న అమెరికా అధ్యక్షుడిపై నుంచి ఓటర్ల దృష్టిని మరల్చడం కోసం కమ్యూనిస్టు అల్బేనియాపై బూట కపు యుద్ధ నాటకం ఆడతారు). జేఎన్‌యూ, ఆడపిల్లలు అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులతో ఈ ప్రహసనం సాగడం ఆ హాలీవుడ్  సినిమా కన్నా ఇది మరింత ఎక్కువ హాస్యభరితంగా తయారైంది. బస్సీతో తలపడకపోవడానికి నాకున్న కారణాలివి. ఇక అత్యంత బలంవతురాలైన మానవ వనరుల మంత్రితో పోరాటానికి దిగకుండా ఉండ టానికి కారణం చాలా సరళమైనది. ఆమెకు దీటైన అనర్ఘళోపన్యాస శక్తి, పదజాలం లేదా మేధస్సు నాకు లేవు. కాబట్టి ఆమె గెలుపును అంగీకరించి తప్పుకోవడమే నేను చేయగలిగింది.

 ఈ కేసులో ఇక నాకు మిగిలే సమస్య, ఒక్క మూడవదే. అది, గౌరవ నీయులైన  హైకోర్టు న్యాయమూర్తితో ఈ కేసును వాదించడమెలాగ అనేది చిత్తశుద్ధితో, విచక్షణతో కూడిన పాత్రికేయ విమర్శలను స్వీకరించడానికి తగిన విశాల దృష్టి తమకున్నదని న్యాయమూర్తులు ఎప్పుడూ చెబుతుం టారు. వారి ఆ అనుగ్రహమే ఆధారంగా నేనీ కేసును వాదిస్తాను. పైగా గౌరవనీయులైన మా న్యాయవాది, రాజ్యాంగ నిపుణులు ఫాలీ నారీమన్ ఈ ఉదయం (మార్చి 4) నాతో ఎన్డీటీవీ ‘వాక్ ద టాక్’  కార్యక్రమం షూటింగ్ సందర్భంగా కూడా ఇదే విషయాన్ని చెప్పారు: న్యాయమూర్తి ఆ విద్యార్థికి ఉపన్యాసం లేదా సలహా ఇవ్వడం బాగానే ఉంది. కానీ సరిహద్దుల్లోని సైనికులను మధ్యలోకి లాగి, వారే మన స్వేచ్ఛలన్నిటినీ పరిరక్షిస్తున్నారనడం ఏమిటి? సాహసులైన మన సైనికులు గొప్ప బాధ్యత నెరవేరుస్తున్నారు నిజమే. కానీ మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షిస్తున్నది మన రాజ్యాం గం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తదితరమైన మన సంస్థలే. ఈ వాదనను మరింత విస్తరింపజేయ సాహసించడం కంటే ఆయన వెనుక నక్కి ఈ కేసును పోరాడటమే అనువైనది.

పౌర స్వేచ్ఛల పరిరక్షణ సైన్యం బాధ్యతా?  
 కన్హయ్యపై శస్త్ర చికిత్స చేసే కత్తిని ప్రయోగించకుండా యాంటీ బయొటిక్ ఇంజెక్షన్ ఇచ్చి ఉదారంగా ఆమె అద్భుత నిర్ణయాన్నే తీసుకున్నారు. స్వేచ్ఛకు అనుకూలంగా మన భారత న్యాయ వ్యవస్థ నెలకొల్పిన అత్యుత్తమ సంప్రదా యం ఇది. దర్యాప్తు ఇంకా శైశవ దశలోనే ఉన్నదనీ, నేరం జరిగింద ని కను గొననే లేదని ఆమె అనడం కూడా న్యాయమే. కన్హయ్య జైల్లో గడిపిన కాలం ఆత్మావలోకనానికి అతనికి అవకాశం కల్పించి ఉంటుందనడమే గందరగోళప రుస్తుంది. అతను అసలు ఏ తప్పూ చేయలేదని, ఇది కూడా సాధారణమైన పోలీసుల దుందుడుకుతనానికి మూర్ఖత్వం కూడా తోడైందని తేలితే ఏమౌ తుంది? అతను నిర్దోషి అనే సాహసం చేయడం లేదని మరోమారు తెలుపు కుంటున్నాను. అలాగే అతనింకా దోషీ కాదు. కేవలం అనుమానితులైనందుకే తీహార్ జైల్లో ఆత్మావలోకనం చేసుకోవడం ఏమిటి? అదేమైనా భారతీయ తరహా రాజకీయ నిర్బంధ గృహమా (గులగ్)? నిస్సంశయంగా కానే కాదు. అనుమానితులైనందుకే ఎవర్నీ జైలుకు పంపేయలేం.

లాయర్ల గుంపు ‘‘ప్యాంటు తడుపుకునేలా’’ చావబాదేయజాలదు. ఇంకా దోషులు కాక పోయినా అనుమానితులైన కారణంగానే వారిని రోజుల తరబడి పోలీసు కస్టడీలో ఆత్మావలోకనం చేసుకునేలా చేయలేం. నిర్దోషిగా రుజువయ్యే వరకు దోషే అనే బస్సీ సూత్రీకరణను మన న్యాయవ్యవస్థ ఎంతమాత్రం ఆమోదించదు. తర్వాతిది నారీమన్ ప్రధానంగా లేననెత్తిన అంశం. ట్వీట్లను కూడా న్యాయశాస్త్రం ఇప్పుడు గంభీర చర్చలో భాగంగానే పరిగణిస్తోంది. కోర్టు ఆదేశాలను ఒక్కసారి చదివిన వెంటనే ఈ అంశాన్ని చర్చకు పెడుతు న్నానని నేను ప్రత్యేకించి చెప్పాల్సి ఉంది. రాజ్యాంగబద్ధమైన మన స్వేచ్ఛ లను పరిరక్షిస్తున్నది న్యాయవ్యవస్థ సహా మన సంస్థలా లేక సైన్యమా? అనే ఆసక్తికరమైన చర్చకు కన్హయ్య కేసులోని న్యాయమూర్తి తెరదీశారు.

 ఒక దశాబ్దిపాటూ మనోజ్‌కుమార్ ‘మిస్టర్ భరత్’ తరఫున మహేంద్ర కుమార్ స్వరం జాతీయవాదాన్ని నిర్వచించింది. సదరు న్యాయమూర్తి, నేనూ కూడా నాటి తరం వారిమేనని గూగుల్ చెప్పడం కూడా నేనీ సాహ సానికి దిగడానికి మరో కారణం. ప్రత్యేకించి ఆమె ‘ఉపకార్’ చూసి ఉండొచ్చు. అందులోని ‘‘మేరె దేశ్ కీ ధర్తీ ’’ అనే దేశభక్తి గేయం నుంచి ఆమె ఉటంకించారు కూడా. ‘‘ఆతీ హై ఆవాజ్ యెహీ మందిర్ మస్జిద్, గురుద్వా రోంసే సంభాల్‌కె రెహ్నా అప్నే ఘర్ మే చుపే హుయే గద్దారోం సే’’ (ద్రోహి మన సొంత ఇంటిలోనే ఉండవచ్చు జాగ్రత్త అని అన్ని ఆరాధనా స్థలాలు హెచ్చరిస్తున్నాయి) అనే 1960ల నాటి పాట వినిపించి దశాబ్దాలు గడిచి పోయాయి. కాబట్టి పొరుగింటివాడు కూడా ద్రోహే కావచ్చుననే అనుమా నాన్ని రేకెత్తించిన ఆనాటి ఆలోచనా విధానం నుంచి మనం చాలా దూరం వచ్చేశామనేది నా రెండో వాదన. నేడు మనం అపారమైన ఆత్మవిశ్వాసం గల దృఢమైన దేశంగా ఉన్నాం. వైవిధ్యభరితమైన ఆలోచనలు మనకు హాని కలిగించలేవు. అవి మనల్ని బలోపేతులను మాత్రమే చేస్తాయి.

మనది పాక్ సైన్యం కంటే భిన్నమైనది
 పాకిస్తాన్ జాతీయవాదానికి, భావజాలానికి కేంద్రం సైన్యమే. బహుశా మన దేశంలో రాజ్యాంగం కంటే ఎక్కువగా అక్కడ‘‘పాకిస్తాన్ భావజాలం’’ పాఠ్యాంశం అయ్యేంతగా అక్కడి ప్రభుత్వం భావజాలమయమైంది. ఇటీవలి వరకు అక్కడ రాజ్యాంగమే లేదు. బహుశా అందువల్లే సైన్యం పాకిస్తాన్ భావజాలాన్ని పరిరక్షించే అధికార వ్యవస్థలో కేంద్ర స్థానంలో నిలిచింది. సైన్యం పరిరక్షించేది పాకిస్తాన్ భావజాల సరిహద్దులనా? లేక భౌగోళిక సరిహద్దులనా? అని బెనజీర్ భుట్టో 1990లో ప్రశ్నించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలాంటి ప్రశ్న లేవనెత్తే సాహసం అంత వరకు మరెవరూ చేయ లేదు. సైన్యాలు భావజాలాన్ని పరిరక్షించగలిగేవైతే సోవియట్ యూని యన్‌లో కమ్యూనిస్టు భావజాలం ఎందుకు విచ్ఛిన్నమైపోయింది? అని ఆమె ప్రశ్నించారు. క్వెట్టాలోని సాయుధ బలగాల స్టాఫ్ కళాశాలలో బెనజీర్ ఆ ప్రసంగం చేశారు! ప్రజలు ఎన్నుకున్న ప్రధానే అయినా అలాంటి సాహసం చేసి తప్పించుకునే అవకాశం అక్కడ లేదు. పైగా ఆమె సూటిగా తన సైనికాధిపతుల కళ్లలోకి గుచ్చి చూస్తూ, అదీ వారి సంస్థలోనే కటువుగా చెప్పారు. ఆ తర్వాత ఆమె కొన్ని వారాలకు మించి అధికారంలో ఉండలేదు. సైనికుల వ్యవస్థ ఆమెపై విద్రోహం, భారత్‌కు అనుకూలంగా ఉండటం అనే ఆరోపణలు చేసింది.

భారత్‌లో అలాంటి చర్చకు ఆస్కారమే లేదు. అద్భుతమైన, సాహసో పేతమైన మన సైన్యం మన సరిహద్దులను, రాజ్యాంగబద్ధంగా ఎన్నికై పద్ధతి ప్రకారం ఏర్పడిన పౌర అధికారాన్ని కాపాడుతోంది. స్వేచ్ఛలు, పౌరుల హక్కుల పరిరక్షణ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పౌర సమాజం బాధ్యత. ఒక సైనికుడు లేదా జనరల్ తనకు అన్యాయం జరిగిందని భావించినా అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన మన న్యాయవ్యవస్థనే ఆశ్రయిస్తారు. ఇది చెప్పాక, న్యాయస్థానాల్లోలాగా నేను కూడా... యువర్ లార్డ్‌షిప్! ఇంతటితో నేను నా వాదనను ముగిస్తున్నాను.

 twitter@shekargupta
 శేఖర్ గుప్తా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement