సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఏఏకు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై గోపాల్ అనే వ్యక్తి విక్షణారహితంగా కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ తీవ్రంగా స్పందించారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని నాథూరాం గాడ్సేతో పోల్చారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. (ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది)
‘72 ఏళ్ల క్రితం జాతిపిత మహాత్మ గాంధీని స్వాతంత్ర్య దేశంలో తొలి ఉగ్రవాదిగా గుర్తింపుపొందిన నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఆయన్ని హత్య చేసిన చేసిన రోజునే (జనవరి 30)న గోపాల్ అనే గాడ్సే భక్తుడు విద్యార్థులకు హత మార్చాలని ప్రయత్నించాడు. రామ మందిరం నిర్మాణం పేరుతో దేశాన్ని గాడ్సే దేశంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. దేశాన్ని కాపాడుకోడానికి మేల్కొండి’ అంటూ కన్నయ్య కుమార్ సంచలన ట్వీట్ చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశారు.
देखिए इन तस्वीरो को।नफरत में अंधा होकर आजाद भारत के पहले आतंकवादी नाथूराम गोडसे ने 72साल पहले इसी तरह गांधीजी की हत्या कर दी थी क्योंकि उसे लगता था कि बापू ‘देश के गद्दार’ हैं।आज राम का नाम लेकर सत्ता में आए लोग नाथूराम का देश बना रहे हैं।जागिए,इससे पहले कि पूरा देश बर्बाद हो जाए pic.twitter.com/11rk3JfUPy
— Kanhaiya Kumar (@kanhaiyakumar) January 30, 2020
Comments
Please login to add a commentAdd a comment