తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య | Kanhaiya Goes Home To Bihar, Will Meet Nitish Kumar Today | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య

Published Sat, Apr 30 2016 2:44 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య

తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య

పాట్నా: దేశ ద్రోహం ఆరోపణల కేసులో అరెస్టయి అనంతరం విడుదలయిన జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తన సొంత గ్రామానికి వెళ్లనున్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్నాలో అడుగుపెట్టిన అతడు బెగుసరాయ్లోని తన స్వగ్రామం బిహాత్కు వెళ్లి తన తల్లిదండ్రులను కలవనున్నాడు.

ఈ నేపథ్యంలో శనివారం పాట్నా విమానాశ్రయంలో కన్హయ్య కుమార్ కు భారీ స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా అతడు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత శద్రఘ్న సిన్హాతో భేటీ అవనున్నాడు. మే 1న పలుచోట్ల బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement