RJD chief Lalu Prasad
-
లాలూ ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్.. టెన్షన్లో తేజస్వీ యాదవ్!
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం సడెన్‌గా మళ్లీ లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు తెలిపారు. తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. లాలూ జీ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. మంగళవారం రాంచీలో చికిత్స పొందుతున్న సమయంలో ఇన్ఫెక్షన్ స్థాయి 4.5 గా ఉందని.. అనంతరం ఢిల్లీలో పరీక్షించినప్పడు అది 5.1కు పెరిగిందని తెలిపారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం పరీక్షించినప్పడు ఇన్ఫెక్షన్ స్థాయి 5.9కు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. దాణా కుంభకోణం, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో ఇటీవలే ప్రత్యేక సీబీఐ కోర్టు.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానాను విధించింది. దీంతో ఆయనను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్‌కు తరలించారు. Lalu Prasad Yadav Ji is undergoing treatment in AIIMS, Delhi. His creatinine level was 4.5 when he was in Ranchi. It increased to 5.1 when it was tested in Delhi. It reached 5.9 when tested again. So the infection is increasing: Tejashwi Yadav, RJD leader and son of Lalu Yadav pic.twitter.com/f1iMxN1vdX — ANI (@ANI) March 23, 2022 -
లాలూకు రాజకీయ రుగ్మత..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ రాజకీయ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన శారీరక ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సీపీ ఠాకూర్ అన్నారు. రాజకీయ అస్వస్థతతో బాధపడుతున్న లాలూ వ్యాధికి ఎయిమ్స్‌లో ఎలాంటి చికిత్సా లేదన్నారు. లాలూను ఎయిమ్స్ నుంచి రాంచీ ఆస్పత్రికి తరలించడంపై ఆర్జేడీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎయిమ్స్‌లో లాలూకు హృదయ, మూత్రపిండాల సంబంధిత అస్వస్థతకు చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఎయిమ్స్ నుంచి రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. ‘లాలూకు ఎలాంటి శారీరక రుగ్మతలు లేవు..ఆయన కేవలం రాజకీయ వ్యాధితోనే బాధపడుతున్నారు..దీనికి ఎయిమ్స్ సహా ఎక్కడా చికిత్స లేద’ని స్వయంగా వైద్యుడైన ఠాకూర్ వ్యాఖ్యానించారు.లాలూను రాంచీకి తరలించడం వెనుక కుట్ర జరిగిందని, రాజకీయ ఒత్తిళ్లున్నాయనడం నిరాధార ఆరోపణలని ఠాకూర్ తోసిపుచ్చారు. కాగా మంగళవారం రాంచీ చేరుకున్న లాలూను అంబులెన్స్‌లో రిమ్స్‌లోని కార్డియాలజీ విభాగానికి తరలించారు. -
లాలు కొడుకుతో పెళ్లి వార్తలు అబద్ధం
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుటుంబంతో పెళ్లిసంబంధం విషయం మాట్లాడినట్టు వచ్చిన వార్తలను ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ తోసిపుచ్చారు. లాలు పెద్ద కొడుకు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తన మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయనున్నట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని రాందేవ్ చెప్పారు. ఓ వర్గానికి చెందిన మీడియా ఈ కట్టుకథల్ని ప్రచారం చేసిందని విమర్శించారు. గురువారం రాత్రి పట్నా వచ్చిన రాందేవ్.. లాలుతో సమావేశమయ్యారు. దీనిపై రాందేవ్ మాట్లాడుతూ.. లాలుకు అస్వస్థతగా ఉందని తెలియడంతో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లానని చెప్పారు. అంతేకాని పెళ్లి సంబంధం లేదా పెద్ద నోట్ల రద్దుపై రాజకీయాల గురించి తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. లాలు దేశ సంపదని, ఆయన ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని రాందేవ్ అన్నారు. -
మాజీ సీఎం అనూహ్య నిర్ణయం
పాట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. బిహారీలు ఘనంగా నిర్వహించే 'ఛాత్' పండుగను ఈ ఏడాది జరుపుకోబోనని సోమవారం మీడియాకు చెప్పారు. పెళ్లైన నాటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఛాత్ పూజలో పాల్గొంటోన్న రబ్రీదేవీ.. ఒక రకంగా ఆ పండుగకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. లాలూ ఇంట జరిగే వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని కీలక రాజకీయపక్షాల నాయకులు సైతం హాజరై సందడిచేస్తారు. అయితే ఈ వారాంతంలో జరుగనున్న పండుగకు మాత్రం దూరంగా ఉంటానని రబ్రీ చెప్పారు. ఇంతకీ ఆమె నిర్ణయం వెనుక కారణం ఏమంటే.. ఇద్దరు కొడుకుల పెళ్లి. అవును. లాలూ-రబ్రీ దంపతుల కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ల పెళ్లిళ్లు జరిగిన తర్వాతే తాను తిరిగి 'ఛాత్' పూజలో పాల్గొంటానని రబ్రీ దేవి అన్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రికాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి పెళ్లి విషయమై గడిచిన కొద్దిరోజులుగా లాలూ కుటుంబం తీవ్ర కసరత్తు చేస్తోంది. మొన్నటికిమొన్న రాష్ట్రంలో సమస్యలు తెలపాలంటూ వాట్సాప్ నెంబర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఏకంగా 44వేల పెళ్లి ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనాసరే వచ్చే ఎండలనాటికి ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేసి, కోడళ్లతో సహా వచ్చే ఏడాది ఛాత్ పండుగ జరుపుకోవాలన్న మాజీ సీఎం కల ఏమేరకు నెరవేరుతుందో చూడాలి! దీపావళి తర్వాతి వారాంతంలో ప్రారంభమయ్యే ఛాత్ పండుగను బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా నేపాల్ లోనూ నాలుగురోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. -
తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య
పాట్నా: దేశ ద్రోహం ఆరోపణల కేసులో అరెస్టయి అనంతరం విడుదలయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తన సొంత గ్రామానికి వెళ్లనున్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్నాలో అడుగుపెట్టిన అతడు బెగుసరాయ్‌లోని తన స్వగ్రామం బిహాత్కు వెళ్లి తన తల్లిదండ్రులను కలవనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం పాట్నా విమానాశ్రయంలో కన్హయ్య కుమార్ కు భారీ స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా అతడు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత శద్రఘ్న సిన్హాతో భేటీ అవనున్నాడు. మే 1న పలుచోట్ల బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు. -
బిహార్ ఎన్నికల బరిలో వారసులు
242 మందితో ‘మహాకూటమి’ జాబితా విడుదల చేసిన నితీశ్‌కుమార్ * బరిలో లాలూ ఇద్దరు కుమారులు * వెనుకబడిన వర్గాల ఓట్లే లక్ష్యంగా సీట్ల కేటాయింపు పట్నా/న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరి రసకందాయకంగా మారనుంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల ‘మహాకూటమి’ అభ్యర్థుల జాబితాను బిహార్ సీఎం, మహాకూటమి సీఎం అభ్యర్థి నితీశ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు. ఇందులో ప్రధాన నేతల వారసులు పోటీలో ఉండనున్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వియాదవ్ మహువా స్థానం నుంచి, తేజ్‌ప్రతాప్ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి 242 మంది అభ్యర్థులతో మహాకూటమి జాబితాను నితీశ్‌కుమార్ విడుదల చేశారు. జేడీయూ, ఆర్జేడీ 101 సీట్ల చొప్పున, కాంగ్రెస్ 41 స్థానాల్లో బరిలో ఉండనున్నాయి. రిజర్వేషన్ల అంశంపై తీవ్ర దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో... వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించారు. వెనుకబడిన వర్గాలవారికి 55శాతం, ఎస్సీ/ఎస్టీలకు 15శాతం, ముస్లింలకు 14శాతం, ఓసీ అభ్యర్థులకు 16శాతం టికెట్లు ఇచ్చినట్లు నితీశ్ పేర్కొన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 10శాతం (25 మంది) మహిళలకు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంగా నితీశ్‌కుమార్‌కు మద్దతుదారులుగా ఉన్న కుర్మి, కుశ్వహ కులాలవారికి జేడీయూ తరఫున, లాలూకు గట్టి ఓటు బ్యాంకు అయిన యాదవ్‌లు, ముస్లింలకు ఆర్జేడీ తరఫున టికెట్లు కేటాయించారు. ఇక కాంగ్రెస్ తరఫున ఓసీలకు అవకాశమిచ్చారు. బీజేపీకి ఎక్కువగా పట్టున్న పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇక ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో ఎంఐఎం తరఫున అభ్యర్థులను బరిలోకి దించారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ... ప్రధాని మోదీ, అద్వానీ, ఎంఎం జోషీ, రాజ్‌నాథ్, జైట్లీ సహా 40 మందికి పైగా హేమాహేమీలను ప్రచార రంగంలోకి దించనుంది. ఇటీవలి కాలంలో అధిష్ఠానంతో విభేదిస్తూ వస్తున్న ఎంపీ శత్రుఘ్నసిన్హాను కూడా ఈ ప్రచారకర్తల జాబితాలో చోటు కల్పించటం విశేషం. మరోపక్క అసెంబ్లీ టికెట్టు నిరాకరించడంతో మంత్రి రామ్‌ధానీ సింగ్ బుధవారం పదవికి రాజీనామా చేశారు. జేడీ (యూ)కు గుడ్‌బై చెప్పారు. తన నియోజకవర్గమైన కార్గహర్ నుంచి సమాజ్‌వాది టికెట్టుపై బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టు లాంటిది * భాగవత్ చెప్పిందే బీజేపీకి ఫైనల్: నితీశ్‌కుమార్ పట్నా/ముంబై: దేశంలో రిజర్వేషన్ల విధానంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై విమర్శల పరంపర కొనసాగుతోంది. భాగవత్ వ్యవహారంలోబీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి ఆరెస్సెస్ సుప్రీంకోర్టు లాంటిదని వ్యాఖ్యానించిన నితీశ్.. ఆర్ఎస్ఎస్-బీజేపీ కలసి రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లపై సమీక్ష కోసం మరో రాజ్యాంగ సంస్థను ఏర్పాటుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందే తుది తీర్పు అని అదే మాదిరిగా.. బీజీపీ నేతలకు భాగవత్ చెప్పిందే తుది నిర్ణయమని అన్నారు. కాగా, నితీశ్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. నితీష్‌కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌నుంచి ఆదేశాలు, అనుమతులు పొందుతారని, ఎందుకంటే ఆయనకు వారిద్దరూ సుప్రీంకోర్టు లాంటి వారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ జమ్మూలో విమర్శించారు. మరోవైపు బీజేపీ మిత్ర పక్షం శివసేన భాగవత్ వ్యాఖ్యలను స్వాగతించింది. రాహుల్‌ను పంపించారు బిహార్ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల యుద్ధం జరుగుతోంది. ‘వీకెండ్ విత్ చార్లీరోస్’ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు రాహుల్ అమెరికాలోని ఆస్పెన్‌కు వెళ్లారు. బిహార్ ఎన్నికలకు దూరంగా ఉండాలని మిత్రపక్షాలే రాహుల్‌పై ఒత్తిడి తెచ్చినందువల్లే ఆయన అమెరికా పర్యటకు వెళ్తున్నారని బీజేపీ నేత సంబీత్ పాత్రా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుజ్రేవాలా మండిపడ్డారు. ప్రపంచ స్థాయిలో వివిధ అంశాలపై చర్చించే సదస్సుకు రాహుల్ వెళుతున్నారని...కానీ ‘రిజర్వేషన్ల’ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ పని గట్టుకునిఅవాస్తవాలనుప్రచారం చేస్తోందన్నారు.