లాలూకు రాజకీయ రుగ్మత.. | Senior BJP Leader Says Lalus Disease Is Political Its Not Physical  | Sakshi
Sakshi News home page

లాలూకు రాజకీయ రుగ్మత..

Published Tue, May 1 2018 6:11 PM | Last Updated on Tue, May 1 2018 7:52 PM

Senior BJP Leader Says Lalus Disease Is Political Its Not Physical  - Sakshi

మాజీ కేంద్ర మంత్రి సీపీ ఠాకూర్‌ (ఫైల్‌పోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ రాజకీయ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన శారీరక ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సీపీ ఠాకూర్‌ అన్నారు. రాజకీయ అస్వస్థతతో బాధపడుతున్న లాలూ వ్యాధికి ఎయిమ్స్‌లో ఎలాంటి చికిత్సా లేదన్నారు. లాలూను ఎయిమ్స్‌ నుంచి రాంచీ ఆస్పత్రికి తరలించడంపై ఆర్జేడీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో ఠాకూర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎయిమ్స్‌లో లాలూకు హృదయ, మూత్రపిండాల సంబంధిత అస్వస్థతకు చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఎయిమ్స్‌ నుంచి రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)కు తరలించారు. ‘లాలూకు ఎలాంటి శారీరక రుగ్మతలు లేవు..ఆయన కేవలం రాజకీయ వ్యాధితోనే బాధపడుతున్నారు..దీనికి ఎయిమ్స్‌ సహా ఎక్కడా చికిత్స లేద’ని స్వయంగా వైద్యుడైన ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.లాలూను రాంచీకి తరలించడం వెనుక కుట్ర జరిగిందని, రాజకీయ ఒత్తిళ్లున్నాయనడం నిరాధార ఆరోపణలని ఠాకూర్‌ తోసిపుచ్చారు. కాగా మంగళవారం రాంచీ చేరుకున్న లాలూను అంబులెన్స్‌లో రిమ్స్‌లోని కార్డియాలజీ విభాగానికి తరలించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement