cp thakur
-
లాలూకు రాజకీయ రుగ్మత..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ రాజకీయ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన శారీరక ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సీపీ ఠాకూర్ అన్నారు. రాజకీయ అస్వస్థతతో బాధపడుతున్న లాలూ వ్యాధికి ఎయిమ్స్‌లో ఎలాంటి చికిత్సా లేదన్నారు. లాలూను ఎయిమ్స్ నుంచి రాంచీ ఆస్పత్రికి తరలించడంపై ఆర్జేడీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎయిమ్స్‌లో లాలూకు హృదయ, మూత్రపిండాల సంబంధిత అస్వస్థతకు చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఎయిమ్స్ నుంచి రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. ‘లాలూకు ఎలాంటి శారీరక రుగ్మతలు లేవు..ఆయన కేవలం రాజకీయ వ్యాధితోనే బాధపడుతున్నారు..దీనికి ఎయిమ్స్ సహా ఎక్కడా చికిత్స లేద’ని స్వయంగా వైద్యుడైన ఠాకూర్ వ్యాఖ్యానించారు.లాలూను రాంచీకి తరలించడం వెనుక కుట్ర జరిగిందని, రాజకీయ ఒత్తిళ్లున్నాయనడం నిరాధార ఆరోపణలని ఠాకూర్ తోసిపుచ్చారు. కాగా మంగళవారం రాంచీ చేరుకున్న లాలూను అంబులెన్స్‌లో రిమ్స్‌లోని కార్డియాలజీ విభాగానికి తరలించారు. -
రిజర్వేషన్లకు ముగింపు పలకండి: సీపీ ఠాకూర్
ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు ముగింపు పలకాలంటూ బీజేపీ నేత సీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేకెత్తించాయి. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అయిన ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ఆయన స్పందించారు. అయితే, ఠాకూర్ వాదనను బీజేపీ మిత్రపక్షం అయిన ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ కొట్టిపారేశారు. రిజర్వేషన్లు అనేవి సమాజంలో బలహీనవర్గాలు, దళితుల హక్కని, అవి కొనసాగి తీరాల్సిందేనని పాశ్వాన్ చెప్పారు. విపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఆర్జేడీ కూడా ఠాకూర్‌ను విమర్శించాయి.