న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. హాస్టల్ ఫీజులు పెంచడం, నిబంధనలు కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జేఎన్‌యూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. జేఎన్‌యూ స్నాతకోత్సవానికి కేంద్ర మానవవరులశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ హాజరవ్వడంతో ఆయనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు జేఎన్‌యూ గేట్‌ను నిర్బంధించి.. కేంద్ర మంత్రి రమేశ్‌ను యూనివర్సిటీ ప్రాంగణ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు మంత్రిని బయటకు వెళ్లనివ్వమని విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యార్థులు జేఎన్‌యూ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో స్నాతకోత్సవ ప్రాంగణంలోనే మంత్రిని నిర్బంధించినట్టు అయింది. హాస్టల్ మ్యానువల్ విద్యార్థులకు చుక్కలు చూపిస్తోందని, దీనిని మార్చాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment