సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్ ‘కరోష్యూర్’ను తాము దేశీయంగానే అభివృద్ధి చేశామని ఐఐటీ–ఢిల్లీ వెల్లడించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం దీన్ని ఆవిష్కరించారు. మేక్ ఇన్ ఇండియా దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ కిట్ ధర కేవలం రూ.399. ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్, ల్యాబ్ చార్జీలు కూడా కలిపితే మొత్తం ధర రూ.650 అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కిట్లతో పోలిస్తే ఇదే తక్కువ ధర. 3 గంటల్లో ఫలితం తెలుసుకోవచ్చు. చదవండి:( ఒకేరోజు 3.2 లక్షల కోవిడ్ పరీక్షలు)
Comments
Please login to add a commentAdd a comment