యూపీఎస్‌సీ సిలబస్‌పై జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన | Protests against changes in UPSC syllabus | Sakshi
Sakshi News home page

యూపీఎస్‌సీ సిలబస్‌పై జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన

Published Fri, Oct 11 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

Protests against changes in UPSC syllabus

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్ నుంచి ఇంగ్లిష్‌ను తప్పించాలని జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఉపాధ్యాయులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) కార్యాలయం ముందు గురువారం ఆందోళనకు దిగారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ను తొలగించాలని, లేకపోతే ఇతర విదేశీ లాంగ్వేజ్‌లను చేర్చాలని కోరారు.
 
జేఎన్‌యూ ఉపాధ్యాయులు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల యూనియన్ యూపీఎస్‌సీ చైర్మన్ డీపీ అగర్వాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రపంచీకరణ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం, అధికారులు యూపీఎస్‌సీ సిలబస్‌లో విదేశీ లాంగ్వేజీలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం విదేశీ లాంగ్వేజీని చదువుతున్న అనేక మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని జేఎన్‌యూఎస్ యూ అధ్యక్షుడు అక్బర్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement