స్మృతి లాంటి తల్లి అవసరం లేదు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. యూనివర్సిటీ విద్యార్థులు స్మృతి పిల్లలు కాదన్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలని, ఆమె లాంటి తల్లి అవసరంలేదని జేఎన్యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అనంత్ ప్రకాశ్ నారాయణ్ విమర్శించాడు.
గురువారం లోక్సభలో స్మృతి చేసిన ప్రసంగంపై అనంత్ మాట్లాడుతూ.. 'ఇది పూర్తిగా రాజకీయ అంశం. మేం ఆమెకు రాజకీయ ప్రత్యర్థులం' అని అన్నాడు. స్మృతి పార్లమెంట్ను తప్పుదోవపట్టించారని విమర్శించాడు. ఈ నెల 9 ఘటనకు సంబంధించి అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.