వారికి కూడా ప్రత్యేకంగా హాస్టల్‌ వసతి! | Hostel accommodates specially for transgenders at TISS | Sakshi
Sakshi News home page

ముంబై ‘టిస్‌’లో ఈ హాస్టల్‌ ప్రత్యేకం!

Published Mon, Sep 17 2018 3:22 AM | Last Updated on Mon, Sep 17 2018 11:32 AM

Hostel accommodates specially for transgenders at TISS - Sakshi

కాలేజీ క్యాంపస్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్స్‌ ఉంటాయి. అయితే ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎస్‌ఎస్‌) మరో ముందడుగు వేసింది. లింగ నిర్ధారణ కాని వారు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా హాస్టల్‌ వసతి కల్పించింది. వారి హక్కులను గౌరవించింది. ఇలా ఎల్జీబీటీక్యూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ‘వ్యక్తుల ఆత్మగౌరవాన్ని తప్పనిసరిగా పరిరక్షించాలి. హుందాగా జీవించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తింపు పొందింది. లింగ భేదం కారణంగా వివక్ష చూపరాదు, గౌరవప్రదంగా జీవించే హక్కు వారికి ఉంది’ అని సర్వోన్నత న్యాయస్థానం ‘స్వలింగ సంపర్కం’కేసు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. వాటిని అక్షరాలా ఆచరించి చూపించింది టిస్‌.

ఇలా ప్రారంభమైంది..
జెండర్‌ న్యూట్రల్స్‌కు క్యాంపస్‌లో ప్రత్యేక హాస్టల్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, గత సెప్టెంబర్‌లో జరిగిన విద్యార్థి సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. విద్యార్థి సంఘం ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. హాస్టల్‌ ఏర్పాటుపై విద్యార్థులు, పాలకవర్గం, బోధనా సిబ్బంది చర్చలు జరిపారు. వారి కోసం ప్రత్యేకంగా హాస్టల్‌ ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించారు. ఈ హాస్టల్‌ అవసరాన్ని అందరం గుర్తించామని, అందుకే వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆశా బానో అన్నారు.

నిర్ధారణకు కమిటీ
హాస్టల్‌ ఏర్పాటు నిర్ణయం అనంతరం ఓ కమిటీ నియమించారు. హాస్టల్‌లో ఎవరికి ప్రవేశం కల్పించాలనే అంశంపై నిబంధనలు రూపొందించారు. అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్‌లో చేర్చుకోవడానికి అవకాశం లేని వారికి ఇందులో ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. అయితే అదే సమయంలో ఎల్జీబీటీక్యూ విద్యార్థులను మిగతా వారి నుంచి వేరు చేయాలనేది తమ ఉద్దేశం కాదని ఓ ప్రొఫెసర్‌ తెలిపారు. ఈ హాస్టల్‌లో ఉండాలా.. వద్దా.. అనేది విద్యార్థుల ఇష్టమ న్నారు. ఇతరులు కూడా తమకు ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చ న్నారు. రూమ్‌కు ఇద్దరు ఉండేలా పది గదులను కేటాయిం చారు. ప్రస్తుతం 17 మంది ఈ హాస్టల్‌లో ఉంటున్నారు.

ఎవరైనా రావొచ్చు
సాధారణంగా అమ్మాయిల హాస్టల్‌కు అబ్బాయిలను రానివ్వరు..అబ్బాయిల హాస్టల్‌లోకి అమ్మాయిలకు ప్రవేశం ఉండదు. అయితే ఈ హాస్టల్‌కు ఎవరైనా రావొచ్చు.. రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉండొచ్చు. ‘నన్ను క్వీర్‌గా గుర్తించారు. (విపరీత/ వికృత స్వభావం ఉన్నవారు) ప్రస్తుతం అబ్బాయిల హాస్టల్‌లో ఉంటున్నా.. ఎలా ఉంటుందో చూద్దామని అప్పుడప్పుడూ జెండర్‌ న్యూట్రల్‌ హాస్టల్‌లో ఉంటున్నా. నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం, నా బాధలను చెప్పుకు నేందుకు స్నేహితులు ఇక్కడ దొరికారు’అని మిథున్‌ అనే వ్యక్తి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement