ఎంటెక్‌ సీట్లలో భారీగా కోత | M Tech Course Seats Will Reduced | Sakshi
Sakshi News home page

ఎంటెక్‌ సీట్లలో భారీగా కోత

Published Wed, Apr 15 2020 8:42 AM | Last Updated on Wed, Apr 15 2020 8:42 AM

M Tech Course Seats Will Reduced - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: పీజీ ఇంజనీరింగ్‌లో (ఎంటెక్‌) ఈసారి భారీగా సీట్లు తగ్గిపోనున్నా యి. ఇందుకోసం పలు కాలేజీల యాజమాన్యా లు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నాయి. ఎంటెక్‌ కోర్సుల నిర్వహణ సమస్యగా మారడం తో ఈ నిర్ణయానికి వచ్చాయి. వర్సిటీల నిబంధనల ప్రకారం ప్రతి ఎంటెక్‌ కోర్సులో 12 మంది విద్యార్థులకు ఒక పీహెడ్‌డీ అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది.  విద్యార్థులు పెద్ద గా కాలేజీలకు రాకపోవడం, చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుండటంతో వేతన భారం తప్పించుకునేందుకు కాలేజీలు ఎంటెక్‌ కోర్సులను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా యి. ఈ నేపథ్యంలో ఈసారి 2 వేల సీట్ల రద్దుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధ్యాపకులను  తొలగిస్తున్నట్లు సమాచా రం పంపించడంతో వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవల నగర పరిసరాల్లోని ఓ కాలేజీ యాజమాన్యం ఓ అధ్యాపకున్ని తొలగిస్తున్నట్లు ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపించి అదే తొలగింపు ఆర్డర్‌ గా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఆందోళనలో పడ్డారు. ఇది ఆయ న ఒక్కరి పరిస్థితే కాదు..రాష్ట్రంలోని అనేక మంది పరిస్థితి ఇదే కావడంతో ఆందోళన నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement