
సాక్షి, తాడేపల్లి: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలతో పాటు మైనారిటీలకు వెన్నుపోటు పొడిశారు. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే కేటాయించారు. మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే కేటాయించడం పట్ల చంద్రబాబు వ్యవహారశైలిపై ఇతర వర్గాలు మండిపడుతున్నారు.
2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు.
న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు.
మరోవైపు, చంద్రబాబు తీరుపై టీడీపీ యువ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, యువ రక్తంతో పార్టీని నింపేస్తామంటూ చంద్రబాబు, లోకేష్ ప్రకటనలు గుప్పించారు. యువతకు 40 శాతం సీట్లు ఎక్కడంటూ ఆ పార్టీ యువ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట!
Comments
Please login to add a commentAdd a comment