పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు రకరకాల ఎత్తుగడలు పన్నడం గురించి విన్నాం. మహా అయితే నేరాన్ని వేరే వారిపై లేదా సాక్ష్యాధారాలు మార్చడం వంటివి చేస్తారు. అంతేగాని జంతువులపై నెపం నెట్టడం చూడటం అరుదు. పట్టుపడకుండా ఉండేలా జంతువుని బుక్ చేసిన వ్యక్తి బహుశా అతడేనేమో. అతన చేసిన పనికి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన యూఎస్‌లోని కొలరాడోలో చోటే చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని కొలరాడో రోడ్డుపై కారు ఓ మాదిరి స్పీడ్‌తో వస్తుంది. ఇంతతో ఓ రహదారి వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రతి వాహనదారుడిని చెక్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ కారు వారి వద్దకు వస్తుండటం గమనించి ఆపారు. కామన్‌గా పోలీసులు ఆపిన వెంటనే సదరు వ్యక్తులు కారుదిగి రావడం జరుగుతుంది. ఐతే ఇక్కడ కారు ఆపినా ఎవరూ బయటకు రాకుండా అలానే ఉండటంతో పోలీసులు ఒక్కసారిగా ఏం జరుగుతుందా అని అనుమానం కలిగింది. దీంతో పోలీసులు కారు వద్దకు నేరుగా వచ్చి చూడగా..డ్రైవింగ్ సీటులో కూర్చొన్న కుక్కను చూసి ఒక్కసారిగా పోలీసులకు ఊపిరి ఆగినంత పనిఅయ్యింది.
ఈ కారుని కుక్కే డ్రైవ్ చేసుకుని వచ్చిందా అంటూ అయోమయంగా చూస్తుండిపోయారు. కాసేపటికి వారు కారుని పరికించి చూడగా ప్యాసింజర్ సీటులో ఉన్న ఓ వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులు ఆరా తీశారు. ఐతే ఆ వ్యక్తి తాను డ్రైవ్ చేయలేదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసలు తమదైన శైలిలో అడగగా సీట్లు మార్చుకున్నట్లు తెలిపాడు. అతను డ్రింక్ చేశాడేమనన్న అనుమానంతో పరీకించగా తాగిన సంకేతాలు కనబర్చాడు.
అంతే అతను అరెస్టు నుంచి తప్పించుకోవాలని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు అతడినికి కేవలం 20 గజాల దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కను జంతువుల సంరక్షణాధికారి పర్యవేక్షణలో ఉంచి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తాను పట్టుపడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు పోలీసులు ఎదుట అంగీకరించాడు.
(చదవండి: దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్ అధినేత)
Comments
Please login to add a commentAdd a comment