టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అరకొరగా సీట్లు
రెండు విడతలుగా ప్రకటించిన 128 సీట్లలో ఓసీలకే ప్రాధాన్యం
సొంత సామాజిక వర్గానికంటే తక్కువగా బీసీలకు బీసీలకు 24తో సరి
కమ్మ సామాజికవర్గానికి 28 సీట్లు
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు
కాపులకు 8, మైనారిటీలకు 3
మహిళలకు ఇచ్చిన సీట్లు కేవలం 17
సాక్షి, అమరావతి: బడుగు, బలహీనవర్గాల కోసమే టీడీపీ పుట్టిందని, సామాజిక న్యాయమని బాబు పదే పదే ఊదరగొడుతుంటారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఇతర పదవుల పంపకాల్లో ఆయన ఎప్పుడూ అగ్రవర్ణాల పక్షమే ఉంటారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనతో బాబు సామాజిక బండారం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఈసారీ బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని అభ్యర్థుల ఎంపిక రుజువు చేసింది.
రెండు విడతలుగా 128 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు సామాజిక న్యాయానికి పాతరేశారు. తన సొంత సామాజికవర్గానికి, ధన బలం, కండ బలం ఉన్న వారికి సీట్లు కట్టబెట్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను చిన్న చూపు చూశారు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ సగం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చి తమ ప్రాధాన్యం బడుగు, బలహీన వర్గాలేనని చాటి చెప్పింది.
కానీ తమది బీసీల పార్టీ అని ప్రచారం చేసుకునే బాబు మాత్రం వారికి వెన్నుపోటు పొడిచారు. ప్రకటించిన 128 సీట్లలో ఓసీలకు 72 సీట్లు కేటాయించి, బీసీలకు మాత్రం 24 సీట్లతో సరిపెట్టారు. మొదటి జాబితాలో 18, రెండో జాబితాలో 6 సీట్లను బీసీ వర్గాలకు ఇచ్చారు. దీనినిబట్టి ఆయన వారిని పల్లకీ మోసే బోయీలుగానే చూస్తున్నారని మరోసారి తేటతెల్లమైంది. మరోవైపు తన సొంత సామాజికవర్గానికి 28 సీట్లు ఇచ్చుకున్నారు. అంటే సొంత సామాజికవర్గానికి ఇచ్చినన్ని సీట్లు కూడా జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు ఇవ్వలేదు. కాపులకు మరీ హీనంగా 8 సీట్లతో సరిపెట్టారు.
అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికి 28 సీట్లు ఇచ్చారు. మొత్తంగా సీట్ల కేటాయింపులో బాబు తన సొంత సామాజికవర్గానికి, ఓసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు 43 సీట్లు కేటాయించిన చంద్రబాబు ఈసారి సగానికి సగం తగ్గించి, పార్టీలో వారి ప్రాధాన్యత ఏమిటో చెప్పేశారు. ఎస్సీలకు 25, ఎస్టీలకు 4 సీట్లను రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు.
మైనారిటీలకు తప్పదన్నట్లు మూడు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మహిళలకూ ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వలేదు. మహిళలకు ఇచ్చింది 17 సీట్లు మాత్రమే. బాబు సామాజిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చినట్లు సీట్ల కేటాయింపు స్పష్టంగా చెబుతోందని విశ్లేçÙకులు అంటున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని 144 సీట్లలో పోటీ చేస్తున్న బాబు ఇంకా 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇదీ చదవండి: నాడు కత్తుల కొలిమి– నేడు పొత్తుల చెలిమి
Comments
Please login to add a commentAdd a comment