భోపాల్: బీజేపీకి 400 సీట్లు ఎందుకు రావాలనేదానిపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తిరిగి తీసుకురాకుండా ఉండాలంటే, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం పడకుండా ఉండటానికి బీజేపీకి ఈ ఎన్నికల్లో 400 సీట్లు రావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి తమకు 400 సీట్లు కావాలని అడగడం లేదన్నారు.
మధ్యప్రదేశ్‌లోని థార్‌లో మంగళవారం(మే7)జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పార్లమెంట్‌లో తమకు ఇప్పటికే 400 సీట్లు ఉండటం వల్లే ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగామన్నారు.
మొదటి దశ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోయాయని, రెండవ దశలో అవి ఏకంగా నామరూపాలు లేకుండా పోయాయన్నారు. మూడవ దశలో మిగిలిందేమైనా ఉంటే తుడిచిపెట్టుకుపోయిందని మోదీ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment