తమిళనాడులోని ఆ రెండు స్థానాలకు ఎన్నికలు | EC cancels polls to two Tamil Nadu Assembly seats | Sakshi
Sakshi News home page

తమిళనాడులోని ఆ రెండు స్థానాలకు ఎన్నికలు

Published Sat, May 28 2016 4:43 PM | Last Updated on Mon, Sep 17 2018 6:12 PM

తమిళనాడులోని ఆ రెండు స్థానాలకు ఎన్నికలు - Sakshi

తమిళనాడులోని ఆ రెండు స్థానాలకు ఎన్నికలు

న్యూఢిల్లీ: తమిళనాడులో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అరవ్ కురిచి, తంజావూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు... ఓటర్లకు భారీగా డబ్బును, బహుమతులను పంచుతున్నారన్న ఆరోపణలతో ఎన్నికల కమిషన్ మే 16న జరగాల్సిన ఎన్నికలను 23వ తేదీకి వాయిదా వేసింది.

అయితే ప్రలోభాల ఆరోపణల పై ఎన్నికల కమిషన్‌కు అందిన నివేదికలు అధారంగా రెండు నియోజకర్గాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. తమిళనాడులో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన రెండు నియోజకవర్గాల్లో జూన్ ఒకటికల్లా ఎన్నికలు  నిర్వహించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి, జూన్ 13న ఎన్నికలు నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement