
కొలిక్కిరాని బీజేపీ-టీడీపీ సీట్ల సర్ధుబాటు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మధ్య సీట్ల సర్ధుబాటు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. దీంతో ఇరు పార్టీల ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. రెండు పార్టీలు ఎవ్వరికీ వారు తమకే ఎక్కువ సీట్లు కావాలంటూ పట్టుబడుతుండడంతో సీట్ల సర్ధుబాటు కొలిక్కిరావడం లేదు.
మజ్లిస్ పార్టీని ఎదుర్కోవాలంటే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీజేపీ అంటుంటే...గ్రేటర్‌లో బీజేపీ కంటే తమకే ఎక్కువ బలం ఉందని టీడీపీ అంటుంది. 45 సిట్టింగ్ డివిజన్లు తమకే కావాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది. నామినేషన్లకు గడువు మరో మూడు రోజుల మాత్రమే ఉండడంతో ఆశావాహుల్లో టెన్షన్ కొనసాగుతోంది. చివరి నిమిషంలో టిక్కెట్ దక్కకపోతే రెబెల్‌గా నామినేషన్ వేసే ప్రయత్నంలో నాయకులు ఉన్నట్లు సమాచారం.