Bihar: డీల్‌ కుదిరింది! బీజేపీ 17, జేడీయూ 16.. | Lok Sabha Elections 2024 BJP To Contest On 17 JDU Gets 16 Seats In Bihar | Sakshi
Sakshi News home page

Bihar: డీల్‌ కుదిరింది.. అత్యధిక స్థానాల్లో బీజేపీ పోటీ.. జేడీయూ 16

Published Mon, Mar 18 2024 6:18 PM | Last Updated on Mon, Mar 18 2024 7:46 PM

Lok Sabha Elections 2024 BJP To Contest On 17 JDU Gets 16 Seats In Bihar - Sakshi

పాట్నా: బిహార్‌లో అధికార ఎన్డీయే కూటమిలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. మొత్తం 40 లోక్‌ సభ స్థానాలున్న బీహార్‌లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనుంది.

దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌) 5 స్థానాల్లో పోటీ చేయనుంది. చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని బీహార్ ఎల్‌జేపీ (రామ్ విలాస్) చీఫ్ రాజు తివారీ తెలిపారు.

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చాతో సహా ఇతర ఎన్‌డీఏ మిత్రపక్షాలు చెరొక్క సీటును పంచుకున్నాయి. అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి చెప్పారు. 

2019 ఎన్నికల్లో బీజేపీ, సీఎం నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ, దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) కలిసి 39 సీట్లు, 53 శాతానికి పైగా ఓట్లు సాధించాయి. కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాగా ఆర్జేడీ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుపొందలేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement