ఐఐటీల్లో సీట్ల సంఖ్య లక్షకు పెంపు
ఐఐటీల్లో సీట్ల సంఖ్య లక్షకు పెంపు
Published Fri, Nov 25 2016 4:30 AM | Last Updated on Thu, Aug 9 2018 4:22 PM
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో సీట్ల సంఖ్యను 2020 నాటికి ఒక లక్ష వరకూ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే వెల్లడించారు. ప్రస్తుతం అన్ని ఐఐటీల్లోనూ కలిపి 82,604 సీట్లున్నాయని తెలిపారు. ఐఐటీల్లో విద్యా ప్రమాణాలు నానాటికి తగ్గి పోతుండటంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ... విద్యావసరాలకు తగినట్లుగా ప్రతిభ గల అధ్యాపకులను ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. వీరి ఎంపికకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ.. ఉత్తమ ప్రతిభగల అధ్యాపకులను ఆకర్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడాది పొడవునా ప్రకటనలు ఇస్తున్నామని, అలాగే ప్రతిభ ఉన్న వారిని ఐఐటీలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
Advertisement
Advertisement