ఇదేం ‘శిక్ష’ | no seats in welfare collage for kgbv girls | Sakshi
Sakshi News home page

ఇదేం ‘శిక్ష’

Published Wed, Jun 22 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

ఇదేం ‘శిక్ష’

ఇదేం ‘శిక్ష’

ఆడపిల్లల చదువుకు ఎన్నెన్నో అడ్డంకులు
కేజీబీవీ విద్యార్థినులకు సంక్షేమ కళాశాలల్లో దొరకని సీట్లు
పదోతరగతితోనే ఆగుతున్న చదువులు

జిల్లాలోని 26 కేజీబీవీల పరిధిలో గత ఏడాది 915 మంది బాలికలు 10వ తరగతి పరీక్ష రాయగా,  ఇందులో 703 మంది ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలు గతంలో కొన్ని ఐటీడీఏ పరిధిలో, మరికొన్ని సాంఘికసంక్షేమశాఖ పరిధిలో, ఇంకొన్ని సర్వశిక్ష అభియాన్ పరిధిలో నడిచేవి. వీటన్నింటిని ఎస్‌ఎస్‌ఏ(సర్వశిక్ష అభియూన్) పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కేజీబీవీ విద్యార్థినులకు కష్టాలు మొదలయ్యూరుు. పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించిన 703 విద్యార్థినుల్లో కేవలం 100 మందికి మాత్రమే సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలల్లో సీట్లు వచ్చారుు. మిగతా వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురించింది.         - ఖమ్మం

ఖమ్మం: గత విద్యాసంవత్సరంలో ఖమ్మం రూరల్ మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయ(కేజీబీవీ)లోని పదోతరగతి విద్యార్థినులు 46 మందిలో 37 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ముగ్గురికి మాత్రమే సాం ఘిక సంక్షేమ శాఖ జూనియర్ కళాశాలలో సీటు వచ్చింది. మిగిలిన వారికి రాలే దు. వీరిలో, 9.3 జీపీఏ సాధించిన పి.లక్ష్మి ప్రస న్న కూడా ఉంది. ఇన్ని మార్కులు వచ్చి నా సీటు రాకపోవడంపై ఆమె కుమిలిపోతోంది.

 కొణిజర్ల కేజీబీవీలోని 49 మంది పదోతరగతి విద్యార్థినుల్లో 31 మంది ఉత్తీర్ణుల య్యారు. వీరిలో ఏ ఒక్కరికీ సాంఘిక సం క్షేమ, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలల్లో సీటు రాలేదు. వీరంతా, ఎక్కడ చదవాలో తెలీక అయోమయంలో ఉన్నారు.

 కారేపల్లిలోని కేజీబీవీలో పదోతరగతి పరీక్షలు రాసిన 39 మందిలో 25 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఎనిమిది మంది మినహా మిగిలిన వారికి సాంఘిక సం క్షేమ, గిరిజన సంక్షేమ కళాశాలల్లో వీరికి  (ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో) సీట్లు రాలేదు. సెకండ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘అప్పటికీ సీటు రాకపోతే..’ అనే భయాందోళన వీరిని వెంటాడుతోంది. కేజీబీవీలన్నిటినీ ‘సర్వశిక్ష అభియాన్’ కిందికి తేవడంతో వారికి సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సీటు పొందలేని కేజీబీవీ బాలికలు.. ‘మాకు ఇదేమి శిక్ష?’ అని, తీవ్ర ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.

 జిల్లాలోని కేజీబీవీలలో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థినుల్లో అనేకమందిది ఇదే పరిస్థితి. వీరిలో కొందరికి తల్లిదండ్రులు లేరు. ఇంకొందరికి ఎవరో ఒకరు మాత్రమే ఉన్నారు. ఆలనాపాలనా అందక ఇక్కడికి చేరిన వారు మరికొందరు. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న వీరందరికీ చదువు చెప్పేందుకు కేజీబీవీలను కేంద్రం ప్రారంభించింది. పదోతరగతి వరకు వీరి చదువు సాఫీగా సాగింది. ఆ తరువాతనే ఇబ్బం దు లు ఎదురవుతున్నాయి. ‘‘ఎక్కడా సీటు రాకపోతే ఎలా? ఇంతటితో చదువు ఆపేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం’’ అని, వారు తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ కళాశాలల్లో తగ్గిన సీట్లు
కేజీబీవీ బాలికలకు మోడల్ స్కూల్స్, డీఆర్‌డీఏ,  సంక్షేమ జూనియర్ కళాశాలల్లోని సీట్లలో గతంలో అత్యధికం కేటాయించేవారు. కేజీబీవీలలో కొన్ని ఐటీడీఏ పరిధిలో, మరికొన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో, ఇంకొన్ని సర్వశిక్ష అభియాన్ పరిధిలో నడిచేవి. వీటన్నిటినీ ఒకే గొడుగు కిందికి తీసుకరావాలనే ఆలోచనతో గత విద్యాసంవత్సరం నుంచి సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోకి చేర్చారు. దీంతో, గతంలో సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించిన ఆ శాఖ అధికారులు.. తమ పరిధిలో కేజీబీవీలు లేవనే సాకుతో ఆ సంఖ్యను కుదించారు. మొత్తం సీట్లలో 60 శాతం వరకు కేజీబీవీ బాలికలకు కేటాయిస్తామని చెప్పిన అధికారులు.. తీరా ఇప్పుడు ఒక్కో కళాశాలకు కేవలం మూడంటే మూడు సీట్లే కేటాయించినట్టు సమాచారం.

 ‘‘మా పరిస్థితిపై అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. మా అందరికీ సంక్షేమ కళాశాలల్లోగానీ, మోడల్ స్కూల్స్‌లోగానీ, గిరిజన సంక్షేమ కళాశాలల్లోగానీ సీట్లు కేటాయించాలి’’ అని, కేజీబీవీ విద్యార్థినులు వేడుకుంటున్నారు.

అగమ్యగోచరంలో 600 మంది
జిల్లాలోని కేజీబీవీల్లో పదోతరగతి పూర్తయిన వారిలో  600 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. గత ఏడాది 915 మంది పదోతరగతి పరీక్షలు రాశారు. 703 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 100 మందికి మాత్రమే బాలికల సంక్షేమ జూనియర్ కళాశాలల్లో సీట్లు వచ్చినట్టు సమాచారం. మిగతా వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఉన్నతాధికారులతో చర్చిస్తా
కేజీబీవీల్లో పదోతరగతి పూర్తిచేసిన బాలికలు ఇక్కడే ఇంటర్ చదివించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. వీరి పరిస్థితిపై కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో చర్చిస్తా. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. మన జిల్లాలోని బాలికలకు సీట్లు ఎలా ఇప్పించాలనే విషయంపై అధికారులతో సంప్రదించి న్యాయం చేస్తాం. ఉన్నత చదువులకు వెళ్లేలా వారిని ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.               
  - రవికుమార్, ఎస్‌ఎస్‌ఏ పీఓ

 ఆర్వీఎం దృష్టికి తీసుకెళ్లాను
పదిలో ఉత్తీర్ణులైన 25 మందితో సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలల్లో, మోడల్ స్కూల్స్‌లో దరఖాస్తు చేయించాం. ఎనిమిది మందికి మాత్రమే సీట్లు వచ్చాయి. మిగిలిన వారి పరిస్థితి ఒకింత దయనీయంగా ఉంది. పదితోనే చదువు ఆపాల్సి వస్తుందేమోనని, కూలీనాలీ పనులకు వెళ్లక తప్పదేమోనని వారు భయపడుతున్నారు. సెకండ్ కౌన్సిలింగ్‌లోనైనా సీట్లు వస్తాయోమోనని అనుకుంటున్నాం. ఈ విషయాలను ఇప్పటికే ఆర్వీఎం దృష్టికి తీసుకెళ్లాం.  - ఝాన్సీ సౌజన్య, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ,కారేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement