'ఎస్ఆర్సీసీ'లో తమిళనాడు విద్యార్థుల ప్రభంజనం! | Tamil Nadu students grab up to 80% of seats in SRCC so far | Sakshi
Sakshi News home page

'ఎస్ఆర్సీసీ'లో తమిళనాడు విద్యార్థుల ప్రభంజనం!

Published Sat, Jul 2 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

'ఎస్ఆర్సీసీ'లో తమిళనాడు విద్యార్థుల ప్రభంజనం!

'ఎస్ఆర్సీసీ'లో తమిళనాడు విద్యార్థుల ప్రభంజనం!

న్యూఢిల్లీః దేశ రాజధాని నగంరంలో విద్యావిధానంలోనే తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకొని, స్థానిక విద్యాలయాలకు దీటుగా  ప్రత్యేక గౌరవాన్ని పొందుతున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఇప్పుడు తమిళనాడు విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. భారతదేశంలోనే కామర్స్ విద్యకు నెలవుగా ప్రఖ్యాతి పొందిన ఎస్ఆర్సీసీ..  అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో భాగంగా బీకాం హిస్టరీ, ఎకనామిక్స్ లను విద్యార్థులకు అందిస్తోంది . అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఢిల్లీ యూనివర్శిటీ సారధ్యంలోని ఎస్ఆర్సీసీ కళాశాలలో సీటు పొందాలంటే కటాఫ్ మార్కులు 98 శాతం దాటాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఒక్క తమిళనాడుకు చెందిన విద్యార్థులే 75 నుంచి, 80 శాతం సీట్లను కైవసం చేసుకొని కళాశాల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఇప్పటివరకూ భర్తీ చేసిన సీట్లలో మరి కొందరు కేరళకు చెందినవారు ఉన్నట్లుగా సిబ్బంది చెప్తున్నారు.

స్థానిక విద్యాలయాలకే తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో తమిళనాడు విద్యార్థుల హవా కొనసాగింది. ఈ విద్యాసంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్లు ఇచ్చేందుకు కళాశాల నిర్వహించిన మొదటి రెండురోజుల డ్రైవ్ లో తమిళనాడుతోపాటు అత్యధికంగా కేరళ విద్యార్థులు కూడ ఎన్ రోల్ చేసుకున్నారు. కామర్స్ ఎడ్యుకేషన్ అంటే దేశంలోనే మొదటిగా గుర్తుకొచ్చే శ్రారామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో సీటు సంపాదించడం ఎంతో కష్టం. అటువంటిది ఇప్పుడు 75 నుంచి 80 శాతం సీట్లు కేవలం తమిళనాడు విద్యార్థులే కైవసం చేసుకోవడం కళాశాల సిబ్బందినే ఆశ్చర్యపరుస్తోంది. తమ సర్వీసులో ఇటువంటి అనుభవం ఎప్పుడూ జరగలేదని సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇచ్చిన అడ్మిషన్లలో 80 శాతం వరకూ తమిళనాడునుంచి వచ్చినవారే ఉన్నారని, మిగిలినవారిలో కొందరు కేరళ బోర్డుకు చెందిన విద్యార్థులు కూడ ఉన్నారని ఎస్ఆర్సీసీ కళాశాల అడ్మిషన్ ఇన్ ఛార్జ్ అనిల్ కుమార్ తెలిపారు. ఢిల్లీ యూనివర్శీటీ స్టేట్ బోర్డ్స్ నుంచి వచ్చే విద్యార్థుల మార్కుల విషయంలో ఎటువంటి నిబంధనలు విధించలేదన్నారు. ఇప్పటివరకూ 339 మంది విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, ఫీజు చెల్లించటంకోసం యూనివర్శిటీకి కూడ పంపించినట్లు అనిల్ కుమార్ తెలిపారు.

ముఖ్యంగా బికాం హిస్టరీలో అడ్మిషన్లకోసం తమిళనాడునుంచి అత్యధికశాతం విద్యార్థులు వచ్చారని, కేవలం ఒకే రాష్ట్రంనుంచి ఇంతమంది విద్యార్థులు అడ్మిషన్లకు పోటీపడటం కళాశాల చరిత్రలోనే చూడలేదని ఎస్ఆర్సీసీ కాలేజీ అధికారులు కొందరు చెప్తున్నారు. అయితే ఈయేడు ఇప్పటివరకూ తాము అడ్మిషన్లు ఇచ్చినవారిలో అత్యధిక మార్కులున్న విద్యార్థిని కేరళ బోర్డుకు చెందిన ఎలిజబెత్ థామస్ అని తెలిపారు. అడ్మిషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉందని,  ఒకవేళ పూర్తిశాతం సీట్లు భర్తీకాని పక్షంలో రెండో లిస్టును తయారు చేయడం గాని, లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందినవారికి అవకాశం ఇవ్వడంగాని జరుగుతుందని కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం తమిళనాడు బోర్డు అత్యధికశాతం మార్కులను స్కోర్ చేసిందని, అందుకే ఎస్ఆర్సీసీలో ఇప్పుడు అధికశాతం తమిళనాడు విద్యార్థులకు అడ్మిషన్లు లభించాయని కళాశాల ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తెలిపారు. తమిళనాడు బోర్డులో 99 శాతం మార్కులు దాటినవారే అధికంగా ఉన్నారని, అటువంటప్పుడు కాంపిటేషన్ లో వారు ముందుండటం సహజమేనన్నారు. దీన్నిబట్టి చూస్తే విద్యాభ్యాసానికి ఢిల్లీ సరైన ప్రాంతం అని మరోసారి రుజువైందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement