
( ఫైల్ ఫోటో )
కొరుక్కుపేట(చెన్నై): పబ్లిక్ పరీక్షలకు భయపడి దాదాపు లక్ష మంది 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు రాకుండా నిలిచిపోయారు. ప్రసుత్త విద్యా సంవత్సరంలో లక్షమందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేసినట్లు వెల్లడైంది. తమిళనాడు వ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్వహించిన సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.
ఈనేపథ్యంలో ఆ విద్యార్థులను పబ్లిక పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గైర్హాజరైన విద్యార్థుల పేర్లు, వివరాలు సేకరించి పరీక్షకు తీసుకురావాలని, ఆ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment