తిరువొత్తియూరు(చెన్నై): మేట్టూరు సమీపంలో పాఠశాల విద్యార్థులను మసాజ్ చేయమని వేధించిన ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని కొలతూరు పంచాయతీలో యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ 144 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు రాజా ఐదవ తరగతి విద్యార్థులను తన గదికి పిలిపించి చేతులు, కాళ్లు పట్టాలని, మసాజ్ చేయాలని వేధిస్తున్నాడు.
దీనిపై పిల్లలు తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు గురువారం పాఠశాలను ముట్టడించారు. సమాచారం అందుకున్న ఆర్డీవో తనికాచలం, తహసీల్దారు ముత్తురాజా, ఎంఈవో చిన్నరాసు అక్కడికి చేరుకుని విచారించారు. తల్లిదండ్రులు మళ్లీ మేట్టూరు – మైసూరు రోడ్డులో ఆందోళనకు దిగారు. మేట్టూర్ మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రాజాను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
చదవండి: పుట్టింటికి వెళ్తున్నానని ప్రియుడితో కలిసి సహజీవనం.. భర్తకు తెలియడంతో!
Comments
Please login to add a commentAdd a comment