Odisha school teacher arrested for molesting students - Sakshi
Sakshi News home page

ఛీ.. ఇదేం పాడు పని..స్పెషల్ క్లాసులు అని చెప్పి బాలికలతో..

Aug 8 2023 12:16 PM | Updated on Aug 8 2023 1:25 PM

Orissa: Teacher Molestation Students Arrested - Sakshi

వంగర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు పాఠశాలలో పనిచేస్తున్న ఎన్‌ఎస్‌ ఉపాధ్యాయుడు బండి రాముడుపై వంగర పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కుమర్తెతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజాం రూరల్‌ సీఐ హెచ్‌.ఉపేంద్ర ఆదేశాల మేరకు సంతకవిటి ఎస్సై బుడుమూరు లోకేశ్వరరావు వంగర చేరుకుని విచారణ చేపట్టారు.

ప్రత్యేక తరగతుల పేరిట ముందస్తుగా పాఠశాలకు రావాలని చెప్పడం, అందరిలో బాలిక పట్ల వికృత చేష్టలు చేసిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టుచేసిన ఉపాధ్యాయుడు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసేవాడని బాధిత బాలిక తల్లిదండ్రులు విచారణలో తెలియజేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు.

ఎన్‌.ఎస్‌.ఉపాధ్యాయుడు బండి రాముడుపై సస్పెన్షన్‌ విధిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేసినట్లు పాఠశాల హెచ్‌ఎం ముద్దాడ రమణమ్మ తెలిపారు. అభంశుభం తెలియని బాలికపై అసభ్యకరంగా వ్యవహరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ కోరారు. పాఠశాలలో జరిగిన విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన ఆయన పోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి ఎస్సై లోకేశ్వరరావుతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement