రిసాక్, బాలాజీ, నాగరాజు(ఫైల్)
సాక్షి, చెన్నై: కొత్త బైకును ట్రైల్ కోసం నడపడానికి తీసుకువెళ్లిన సమయంలో మినీ వ్యాన్‌ను ఢీకొని ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై పెరుముడి రాళ్లక్వారీ ప్రాంతానికి చెందిన నాగరాజు (25). ఇతని భార్య సుభ కుమారుడు భువిత్‌తో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటికి కొట్టివాక్కానికి చెందిన అన్నయ్య గాంధీ కుమారుడు బాలాజీ (18) ఇటీవల వచ్చాడు.
శనివారం అర్ధరాత్రి విరాలిపాక్కం ప్రాంతంలో ఉన్న చర్చిలో యువకులు కేక్ కట్ చేసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. నాగరాజు, బాలాజీ ఇద్దరు ఇందులో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఒక గంట సమయంలో అదే ప్రాంతానికి చెందిన జోష్వా అనే అతను కొత్త బైక్ తీసుకొచ్చాడు. ఆ కొత్త బైక్‌ను నడిపి చూస్తామని చెప్పి నాగరాజు తన అన్న కుమారుడు బాలాజీ, కరుంబాక్కంకు చెందిన విద్యార్థి రిసాక్ (15)తో కలి వెళ్లారు. తర్వాత చాలా సమయం అయినప్పటికీ వారు తిరిగి రాలేదు.
అనుమానించిన చర్చి వద్ద వున్న యువకులు వారికోసం వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు పక్కన మరమ్మతుకు గురై నిలిచి ఉన్న మినీ వ్యాన్ ఢీ కొట్టి నాగరాజు, ఇద్దరు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మృతి చెంది శవాలుగా పడి ఉన్నారు. స్థానిక పోలీసులు ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment