కర్ణాటక: నగరంలోని బ్యాడరహళ్లికి చెందిన సునంద అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా 48 సీట్లు రిజర్వు చేస్తారా? అని ప్రశ్నించగా సిబ్బంది ఆశ్చర్యపోయారు. వివరాలు.. ఆమె మెజస్టిక్ కేఎస్ ఆర్‌టీసీ బస్టాండుకు వచ్చి, ఒక బస్సులో 48 సీట్లను రిజర్వు చేసుకోవచ్చా అని అధికారులను విచారించారు. ఉచిత ప్రయాణ వసతి ఉన్నందున 4–5 రోజుల పాటు దైవక్షేత్రాలను చూడాలని తలచింది.
కుటుంబసభ్యులు, మహిళా సంఘానికి చెందిన 20 మందిని కలుపుకొని మొత్తం 48 మంది మహిళలు ప్రయాణిస్తామని, సీట్లు రిజర్వు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఉచిత బస్సుల్లో రూ.20 చెల్లించి ముందస్తుగా సీట్లు రిజర్వు చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా రిజర్వు చేసుకోవచ్చా అని ఆమె అడిగారు. అధికారులు పలు కారణాలు చెప్పి అన్ని సీట్లు లేవని సమాధానమిచ్చారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment