పాలిటెక్నిక్‌లలో మిగిలిన 80 వేల సీట్లు | The remaining 80 thousand seats in polytechnic | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌లలో మిగిలిన 80 వేల సీట్లు

Published Thu, Sep 11 2014 1:04 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

The remaining 80 thousand seats in polytechnic

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పాలిటెక్నిక్‌లలో మొత్తం 80,806 సీట్లు మిగిలిపోయాయి. ఆయా పాలిటెక్నిక్‌లలో ప్రవేశానికై నిర్వహించిన పాలీసెట్ మలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. తొలిదశ కౌన్సెలింగ్‌లో 53,901మందికి సీట్లు లభించగా, మలిదశ కౌన్సెలింగ్‌లో అదనంగా మరో 10,381 మందికి సీట్ల కేటాయింపు జరిగింది.

సీట్లు పొందిన అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ లెటర్లను, ఫీజు పేమెంట్ చలాన్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మలిదశలో మొదటిసారి సీటు లభించిన అభ్యర్థులు, కళాశాలను మార్చుకున్న అభ్యర్థులు అలాట్‌మెంట్ లెటర్లపై అథారిటీ సంతకం కోసం తప్పనిసరిగా సమీప హెల్ప్‌లైన్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలి. సీట్లు లభించిన అభ్యర్థులు ఈనెల 15లోగా వారికి కేటాయించిన కళాశాల్లో రిపోర్టు చేయాలి. మరోమారు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండదని అధికారులు స్పష్టంచేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement