పాట్నా: ఎట్టకేలకు బీహార్ శాసన సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మొత్తం 243 సీట్లలో జేడీయూకు 100 , ఆర్ జేడీకి 100, కాంగ్రెస్ 40 సీట్లు కేటాయించారు. ఈ స్థానాల్లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. త్వరలో బీహార్ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు అక్కడి ప్రతిపక్షాలన్ని ఒక్కటైన విషయం తెలిసిందే.
అయితే, సీట్ల పంపకాలపై ఇప్పటివరకు ఓ రకమైన ప్రతిష్ఠంభన నెలకొంది. మిత్ర పక్షాల్లో ఎవరికి ఎన్నిసీట్లు కేటాయిస్తారో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటుండగానే సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ పోటీ పోటీ ప్రభావాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు సమానంగా సీట్లు కేటాయించి వాటికన్నా తక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. ఈ సీట్ల కేటాయింపులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
బీహార్ సీట్ల సర్దుబాటు ఖరారు
Published Wed, Aug 12 2015 3:13 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement