ఐటీఐల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి చర్యలు
Published Thu, Sep 15 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేట్ ఐటీఐ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ప్రిన్సిపాల్ నాయకల్లు సోలోమన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. అభ్యర్థులు ఏ కళాశాలలో చేరాలనుకున్నారో అక్కడే పది రూపాయలు చెల్లించి దరఖాస్తు పొందవచ్చని.. ఈ నెల 20వ తేదీలోపు పూరించిన దరఖాస్తులను అందజేయాలన్నారు. 21న ఉదయం 10 గంటలకు ఆయా కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement