టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్ | Telangana State Polycet Counseling | Sakshi
Sakshi News home page

టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్

Published Tue, May 17 2016 11:02 PM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్ - Sakshi

టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్

టాప్ స్టోరీ
తెలంగాణలో మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ పాలిసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెల 20 నుంచి దాదాపు గతేడాది మాదిరిగానే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రత్యేక కథనం..
 
తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లు
అర్హులు 1,03,001
ప్రభుత్వ కళాశాలలు 56
ప్రైవేటు కళాశాలలు 169
ప్రభుత్వ సీట్లు 12,000
ప్రైవేటు సీట్లు 46,000
 
మొదటి దశ  రిజిస్ట్రేషన్
విద్యార్థులు ర్యాంకుల ప్రకారం నిర్దేశిత తేదీల్లో మొత్తం 21 హెల్ప్‌లైన్ సెంటర్లలో ఏదో ఒకదానికి హాజరై ర్యాంకు కార్డ్‌ను సంబంధిత అధికారికి అందజేసి పేరు నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 చెల్లించాలి. ఈ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నెంబర్‌ను తెలియజేయాలి. (ఈ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా లాగిన్ ఐడీ పంపుతారు. దీని ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకోసం లాగిన్ కావచ్చు.
 
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకువెళ్లాల్సినవి
టీఎస్‌పాలిసెట్ ర్యాంక్ కార్డ్
టీఎస్‌పాలిసెట్ హాల్‌టికెట్
పదో తరగతి మార్కుల మెమో
నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్
నివాస ధ్రువీకరణ పత్రం
జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం
ఆధార్ కార్డ్
కుల ధ్రువీకరణ పత్రం
వికలాంగులు/ఎన్‌సీసీ/స్పోర్ట్స్/చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ డ్ ఫోర్సెస్/మైనారిటీస్/ఆంగ్లో ఇండియన్స్ సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుకోవాలి.
అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలి.
 
రెండో దశ (సర్టిఫికెట్ వెరిఫికేషన్)
ఈ దశలో అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సంబంధిత వెరిఫికేషన్ అధికారికి అందజేసి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందస్తు కసరత్తు కోసం ఉద్దేశించిన మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్‌ను ఇస్తారు. దీన్ని కూడా తీసుకుంటే రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లే.
 
మూడో దశ (ఆప్షన్స్ ఎంట్రీ కసరత్తు)
రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులకు మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్‌ను ఇస్తారు. కోర్సులు, కళాశాలలు సీట్ల ఆధారంగా ప్రాథమ్యాలను ఎంపిక చేసుకోవాలి.
 
నాలుగో దశ (ఇంటర్నెట్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్‌సైజ్ ప్రక్రియ ప్రారంభం)
ఇంటర్నెట్ ఆధారంగా కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ ప్రాథమ్యాల మేరకు ఆప్షన్స్ ఎంట్రీ చేయాలి. ఈ క్రమంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వెర్షన్‌నే వినియోగించాలి.
 
తదుపరి దశ ఆప్షన్స్ ఎంట్రీ- లాగిన్ ఐడీ
పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నాక లాగ్ అవుట్ అవ్వాలి. తిరిగి హోంపేజీకి వెళ్లి క్యాండిడేట్స్ లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చాలి. లాగిన్ ఐడీ విద్యార్థుల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ వివరాలు పూర్తిచేశాక సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేస్తే నమూనా ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు One Time Password (OTP) కాలమ్ పక్కన టిక్ చేస్తే విద్యార్థుల మొబైల్ నెంబర్‌కు వన్‌టైం పాస్‌వర్డ్ మెసేజ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఓటీపీ బాక్స్‌లో పొందుపర్చాలి. తర్వాత డిక్లరేషన్‌ను చదివి, ‘క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ’ బటన్‌పై క్లిక్ చేయాలి.
 
డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్
ఆప్షన్ ఎంట్రీ బటన్‌పై క్లిక్ చేశాక రీజియన్లు, జిల్లాలు, కోర్సులతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమకు సరిపడే బాక్స్‌ల పక్కన టిక్ చేసి డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్‌పై క్లిక్ చేయాలి.
 
ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్
అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రీజియన్ల పరిధిలో, ఎంపిక చేసుకున్న జిల్లాల్లో ఉన్న కళాశాలల కోడ్‌లు, బ్రాంచ్‌లతో కూడిన ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ కనిపిస్తుంది. దీంట్లో తమకు నచ్చిన ప్రాథమ్యాల ఆధారంగా కాలేజ్ కోడ్, కళాశాల కోడ్ పక్కన ఉండే బాక్స్‌లలో ప్రిఫరెన్స్ నెంబర్ పొందుపర్చాలి.
 
నాలుగో దశ (లాగ్ అవుట్)
ఆప్షన్స్ ఎంట్రీ పూర్తయ్యాక ఔౌజ ైఠ్ట బటన్‌పై క్లిక్ చేస్తే .. ave and Logout, Confirm Logout, Cancel Logout అని మూడు బాక్స్‌లు కనిపిస్తాయి. అభ్యర్థులు అవసరాన్ని బట్టి బాక్స్‌లో టిక్ చేయాలి. ఎలాంటి మార్పులు లేవనుకుంటే Confirm Logout బటన్‌పై క్లిక్ చేయాలి.

అయిదో దశ (సీట్ అలాట్‌మెంట్)
ఆప్షన్స్ ఎంట్రీలో ఇచ్చిన ప్రాధాన్యత క్రమం, ర్యాంకును అనుసరించి వారికి కేటాయించిన కాలేజ్ వివరాలు తెలిపే దశ ఇది. పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారితంగా సాగే ప్రక్రియ. ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను తెలుసుకునేందుకు నిర్దేశిత తేదీల్లో వెబ్‌సైట్‌లో లాగిన్ అయి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
 
ఆరో దశ (ఫీజు చెల్లింపు)
కేటాయించిన కాలేజ్ ఆధారంగా ఏడాదికి రూ.3800 నుంచి రూ.15,500 మధ్యలో ఫీజు  చెల్లించాలి. ఫీజు ఆయా కాలేజ్‌లను బట్టి ఉంటుంది. ఈ ఫీజు చెల్లింపును నేరుగా కాలేజ్‌లోనే చెల్లించేలా గత ఏడాది వెసులుబాటు ఇచ్చారు. ఇదే విధానం ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉంది.
 
ఏడో దశ (కాలేజ్‌లో రిపోర్టింగ్)
అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఫీజు చెల్లించడం ప్రక్రియ పూర్తయ్యాక వాటి ఆధారంగా తమకు సీటు లభించిన కళాశాలలో నిర్దేశిత తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
 
ఎనిమిదో దశ (కౌన్సెలింగ్ తదుపరి దశలకు హాజరవడం)
తొలి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు, తొలి దశలో పాల్గొన్నప్పటికీ సీటు లభించని విద్యార్థులు తదుపరి దశ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. ఈ క్రమంలో తొలిదశలో పాల్గొనని విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా మలి దశ కౌన్సెలింగ్‌కు నిర్దేశిత హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
వెబ్‌సైట్: https://tspolycet.nic.in  
 
వెబ్ ఆప్షన్స్ ముఖ్య తేదీలు:-
మే23, 24: 1 - 28,000 ర్యాంకు వరకు
మే25, 26: 28001- 56000 ర్యాంకు వరకు
మే27, 28: 56001-84000 ర్యాంకు వరకు
మే29, 30: 84001- చివరి ర్యాంకు వరకు
ఆప్షన్ల మార్పు: మే 31
సీట్ ఎలాట్‌మెంట్: జూన్ 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement